అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్
నాచారం, నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)
నాచారం డివిజన్‌లో పురోగతిలో ఉన్న పలు అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు మంజూరు చేయాలని కోరుతూ నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ బుధవారం జిహెచ్ఎంసి కమిషనర్ ఆర్.వి కర్ణన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన కమిషనర్‌కు వినతిపత్రం అందజేశారు.రైతు బజార్ పక్కన ఉన్న ప్రభుత్వ స్థలంలో మల్టీపర్పస్ ఫంక్షన్ హాల్ నిర్మాణం, అన్నపూర్ణ కాలనీకి ఆనుకుని ఉన్న హెచ్ఎంటీ నగర్ పెద్ద చెరువు బఫర్ జోన్‌లో థీమ్ పార్క్ ఏర్పాటు, ఎర్రకుంట హిందూ స్మశానవాటికను వైకుంఠధామంగా అభివృద్ధి చేయడం వంటి కీలక విషయాలను కార్పొరేటర్ కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు.అదనంగా, పటేల్‌కుంట చెరువు పక్కన కోటి 80 లక్షల రూపాయల వ్యయంతో చేపట్టిన సీవరేజ్ లైన్ డైవర్షన్ పనులు ఇంకా పది శాతం మాత్రమే మిగిలి ఉన్నందున వాటిని త్వరగా పూర్తి చేయాల్సిందిగా కోరారు.ప్రతిపాదించిన అన్ని అభ్యర్థనలను సానుకూలంగా పరిశీలిస్తామని కమిషనర్ ఆర్.వి కర్ణన్ హామీ ఇచ్చారు. సంబంధిత సమస్యలపై వెంటనే చర్యలు తీసుకోవాలని జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పటేల్‌కు ఫోన్ ద్వారా సూచించారు.


Comments