ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు 

డిటిడిఓపై వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్

ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా డిప్యూటేషన్లు 

హనుమకొండ,నవంబర్14(తెలంగాణ ముచ్చట్లు):

స్టేషన్ ఘనపూర్ ఆశ్రమ పాఠశాలలో ఉపాధ్యాయుల డిప్యూటేషన్ విషయంలో ప్రభుత్వ జీవోలను పట్టించుకోకుండా వ్యవహరిస్తున్న డిటిడిఓపై విచారణ జరిపి సస్పెండ్ చేయాలని ఎల్ హెచ్ పిఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ అజ్మీరా వెంకట్ నాయక్, బిఆర్ఎస్వీ నియోజకవర్గ ఇంచార్జి లకావత్ చిరంజీవి, గిరిజన విద్యార్థి సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బానోత్ భాస్కర్ డిమాండ్ చేశారు.

స్టేషన్ ఘనపూర్ ఆశ్రమ బాలికల, బాలుర పాఠశాలలో ఉపాధ్యాయుల కొరతపై హెచ్‌ఎంలను ఎదురు అడిగి తెలుసుకున్నామని, అనంతరం పాఠశాల గేటు ఎదుట ఆందోళన నిర్వహించినట్లు వారు తెలిపారు.

గిరిజన పాఠశాలల్లో ఉపాధ్యాయులు పూర్తిగా ఉన్నారని తప్పుడు సమాచారం ఇచ్చి, పని చేస్తున్న ఉపాధ్యాయులను డిప్యూటేషన్ పేరుతో ఇతర జిల్లాలకు పంపుతున్నారని ఆరోపించారు. జనగాం జిల్లా నుండి హనుమకొండ, మహబూబాబాద్కు ఉపాధ్యాయులను పంపడం వాస్తవమేనని, స్టేషన్ ఘనపూర్, నర్మేట పాఠశాలల్లో పనిచేస్తున్న పీజీ హెచ్‌ఎంలను, పీడీని హనుమకొండ జిల్లాకు మార్చడం ఎలా సమంజసం అని ప్రశ్నించారు.

కాళేశ్వరం జోన్‌లోని జులైవాడ బాలికల ఆశ్రమ పాఠశాల నుండి ఉపాధ్యాయురాలను యాదాద్రి జోన్ స్టేషన్ ఘనపూర్‌కు ఎలా పంపారో వివరించాలని డిమాండ్ చేశారు. స్టేషన్ ఘనపూర్ ఆశ్రమ పాఠశాలలో బలవంతపు డిప్యూటేషన్ పేరుతో ఉపాధ్యాయులను డిప్యూటీ వార్డెన్‌గా పనిచేయించడంపై ఆక్షేపించారు. అదే విధంగా అక్కడ పనిచేస్తున్న ఎస్జీటీ లను కూడా ఇతర పాఠశాలలకు తరలించడం ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు.

హనుమకొండ, జనగాం జిల్లాల గిరిజన శాఖ అధికారులు పీఓకు తప్పుడు సమాచారం అందించి, హనుమకొండ జిల్లాలోని ఆరేపల్లి ఆశ్రమ పాఠశాలకు కూడా ప్రభుత్వ నియమాలు విస్మరించి డిప్యూటేషన్ ఇచ్చారని వారు తెలిపారు. ఈ నిర్ణయాలన్నింటి వల్ల జనగాం జిల్లాలో గిరిజన పాఠశాలల్లో సబ్జెక్టు ఉపాధ్యాయుల కొరత ఏర్పడి, గిరిజన పిల్లల విద్య నష్టపోతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

హనుమకొండ జిల్లాలోని ఆశ్రమ పాఠశాలలకే ప్రాధాన్యం ఇస్తూ, జనగాం జిల్లాలోని గిరిజన పాఠశాలలను నిర్లక్ష్యం చేయడం అంగీకారయోగ్యం కాదని వ్యాఖ్యానించారు. డిటిడిఓ వ్యవహారంపై గిరిజన శాఖ కమిషనర్ దృష్టికి ఫిర్యాదు చేస్తామని, ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేసిన డిప్యూటేషన్లను తక్షణమే రద్దు చేయాలని, సంబంధిత అధికారులపై చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!