మల్లెమడుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

మల్లెమడుగు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

ఖమ్మం బ్యూరో,నవంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;

WhatsApp Image 2025-11-14 at 7.21.41 PMఖమ్మం జిల్లా ఖమ్మం అర్బన్ మండలం మల్లెమడుగు పాఠశాలలో ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు నిర్వహించారు నవంబర్ 14 న జవహర్ లాల్ నెహ్రూ జన్మదినాన్ని పురస్కరించుకొని బాలల దినోత్సవం  పేరెంట్ టీచర్ మీటింగ్ తో కలిపి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఘనంగా  జరుపుకున్నామని పాఠశాల ప్రధానోపాధ్యాయులు కె .సాంబమూర్తి తెలియజేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా విద్యార్థినీ విద్యార్థులు వివిధ సాంస్కృతిక కార్యక్రమాలను ప్రదర్శించారు ఇందులో బాలికల అక్రమ రవాణా అనే నాటిక ఎంతో ఆకట్టుకుంది, దేశ నాయకుల వేషధారణ ఎంతో ఆకర్షణీయంగా నిలిచాయని వారు తెలియజేశారు, ఈ సందర్భంగా నిర్వహించిన వ్యాసరచన డ్రాయింగ్ వకృత్వ సాంస్కృతిక దేశ నాయకుల వేషధారణ లలో పాల్గొని విజయం సాధించిన విద్యార్థులకు బహుమతులు ప్రధానోపాధ్యాయులు  చేతుల మీదుగా ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయిని ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .