ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

ఘనంగా బాలల దినోత్సవ వేడుకలు 

ఖమ్మం బ్యూరో , నవంబర్ 14, తెలంగాణ ముచ్చట్లు;

నాగులవంచ శ్రీ ఆదర్శ హై స్కూల్ లో బాలల దినోత్సవ వేడుకలు శుక్రవారం ఘనంగా నిర్వహించారు.  విద్యార్థులు జాతీయ నాయకులు, స్వాతంత్ర సమరయోధులు వేషధారణలతో ప్రత్యేకంగా ఆకట్టుకున్నారు.  విద్యార్థులు ఫ్యాన్సీ డ్రెస్ పోటీల్లో  ప్రత్యేక  ఆకర్షణగా నిలిచారు.  ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాసరచన , వక్తృత్వ , పాటల పోటీలు నిర్వహించారు.  జవహర్ లాల్ నెహ్రూ జీవిత చరిత్ర గురించి పాఠశాల కరస్పాండెంట్ బోడేపూడి కిరణ్ విద్యార్థులకు వివరించారు.‌ ఈ సందర్భంగా పాఠశాలలో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు.‌ కార్యక్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్ చావా అరుణ్ కుమార్, ఉపాధ్యాయులు రేణుక, శ్రీనివాస్,  పుల్లారావు, సుధాకర్, పార్వతి, సురేష్ , ప్రశాంతి, సుజిత, సుజాత, త్రివేణి, చందన,  నాగదుర్గ, ఝాన్సీ, శైలజ, రాశి పాల్గొన్నారు

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .