రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు

వనపర్తి ఎమ్మెల్యే మేఘా రెడ్డి

రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవు

పెద్దమందడి,నవంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

వరి ధాన్యం కొనుగోళ్లలో రైతులను ఇబ్బందులకు గురి చేస్తే కఠిన చర్యలు తప్పవని వనపర్తి ఎమ్మెల్యే తుడి మేఘా రెడ్డి  అన్నారు.

ఈ సందర్భంగా పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామంలో శనివారం  మహిళా సమైక్య ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆయన ప్రారంభించారు.
ఎమ్మెల్యే మేఘా రెడ్డి తెలిపారు, కేంద్రం నుంచి రైతుల ధాన్యాన్ని లారీలలో ఎత్తిన తర్వాత రైతులకు ఎలాంటి సంబంధం ఉండదు. ఎలాంటి సమస్యలు వచ్చినా కేంద్రంలోనే పరిష్కరించాలి. మిల్లర్లతో రైతులకు ఎటువంటి సంబంధం లేదు అని.

అయితే, కేంద్రాల్లో అన్నదాతలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూసుకోవడం నిర్వాహకుల బాధ్యత అని ఆయన స్పష్టం చేశారు. మిల్లర్లపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించి, ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు కొనసాగించవలసిందని ఎమ్మెల్యే సూచించారు.

కార్యక్రమంలో వనపర్తి వ్యవసాయ మార్కెట్ యార్డ్ అధ్యక్షులు శ్రీనివాస్ గౌడ్, ఉపాధ్యక్షులు రామకృష్ణారెడ్డి, మాజీ జెడ్పిటిసి సభ్యులు రమేష్ గౌడ్, మాజీ ఎంపీపీ రఘుప్రసాద్, మాజీ సర్పంచ్ సిద్దయ్య, ఎంపీడీవో, ఎమ్మార్వో , ఏపీఎం, గ్రామ సీనియర్ నాయకులు మధిర శ్రీశైలం,  మహిళా సమాఖ్య సిసి రాణి, వివో ఏ  శారదా, మార్కెట్ కమిటీ మెంబర్స్ సావిత్రి, నాగలక్ష్మి, మాధవి,అనిత,భాగ్యలక్ష్మిమహిళా సంఘం అధ్యక్ష, కార్యదర్శులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు రైల్వే మ్యాన్ ఫ్యాక్చరింగ్ పనులను పరిశీలించిన ఎంపీ కావ్య, ఎమ్మెల్యే నాగరాజు
  కాజీపేట నవంబర్ 19 (తెలంగాణ ముచ్చట్లు)  వచ్చే సంవత్సరం మార్చి నెలలో ప్రారంభం కానున్న కాజీపేట లోని మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ పనులను బుధవారం వరంగల్ ఎంపీ
అభివృద్ధి పనులపై జిహెచ్ఎంసి కమిషనర్‌కి వినతిపత్రం కార్పొరేటర్ 
నాగారం ప్రభుత్వ పాఠశాలలో నశా ముక్త్ భారత్ ప్రతిజ్ఞ కార్యక్రమం
ప్రతి విద్యార్థికి పర్యావరణం పై అవగాహన కల్పించాలి.
ప్రజలకు అవసరమైన ప్రతి చోట మౌలిక వసతులు కల్పించడమే ప్రధాన లక్ష్యం.
కోటి మహిళలకు కోటి ఇందిరమ్మ చీరలు పంపిణీ ప్రారంభం 
నషాముక్తు భారత్ అభియాన్ అవగాహన సదస్సు.!