కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

కూసుమంచి క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలు

ఖమ్మం బ్యూరో, నవంబర్ 8, తెలంగాణ ముచ్చట్లు;

 కూసుమంచిలోని తెలంగాణ రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి క్యాంపు కార్యాలయంలో శనివారం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జి భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి పార్టీ నాయకులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా భీమిరెడ్డి శ్రీనివాస రెడ్డి మాట్లాడుతూ.... ఇళ్లులేని కుటుంబాలకు ఇందిరమ్మ ఇళ్లు, రైతులకు సహాయం, యువతకు ఉపాధి అవకాశాలు ఇవన్నీ సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం  తీసుకువస్తున్న మార్పుల సంకేతాలని పేర్కొన్నారు. పేదల ఆత్మగౌరవాన్ని నిలబెట్టే సంక్షేమ పాలన రాష్ట్రంలో అమలవుతోందని తెలిపారు. ఈ కార్యక్రమంలో కూసుమంచి మండలానికి చెందిన కాంగ్రెస్ పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .