జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలని అదనపు కలెక్టర్ కు వినతి పత్రం
టిడబ్ల్యూజేఎఫ్ నేతలు
మేడ్చల్–మల్కాజ్గిరి, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)
టిడబ్ల్యూజేఎఫ్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు, మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా టిడబ్ల్యూజేఎఫ్ ఆడహాక్ కమిటీ నేతలు జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డికు జర్నలిస్టులు ఎదుర్కొంటున్న సమస్యలను వినతిపత్రం ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ సానుకూలంగా స్పందిస్తూ సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తానని హామీ ఇచ్చారు.రాష్ట్ర కార్యదర్శి సలీమా మాట్లాడుతూ జర్నలిస్టులకు ఎక్రిడేషన్ కార్డులు, ఇళ్ల స్థలాల మంజూరు, మెడికల్ హెల్త్ కార్డులు అందజేయాలని కోరారు. మహిళా జర్నలిస్టుల భద్రతపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని సూచించారు.ఆడహాక్ కమిటీ కన్వీనర్ జి. హరీప్రసాద్ మాట్లాడుతూ జర్నలిస్టుల ఇళ్ల స్థలాల సమస్యలు చాలాకాలంగా పెండింగ్‌లో ఉన్నందున వెంటనే పరిష్కరించాలని అభ్యర్థించారు. రాష్ట్ర–జిల్లా స్థాయిలో ఎక్రిడేషన్ కమిటీల ఏర్పాటుతో పారదర్శకంగా కార్డులు ఇవ్వాలన్నారు. హెల్త్ కార్డులు అన్ని ప్రైవేటు కార్పొరేట్ ఆసుపత్రుల్లో అమలయ్యేలా చూడాలని కోరారు.కో కన్వీనర్ పి. మల్లేష్ మాట్లాడుతూ జర్నలిస్టులపై దాడులు పెరుగుతున్న నేపథ్యంతో వారికి భద్రత కల్పించడం అత్యవసరమని తెలిపారు. ఇందుకోసం పోలీస్, రెవెన్యూ, సమాచార శాఖలతో కలసి ప్రత్యేక కమిటీలు ఏర్పాటు చేసి దాడిచేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని, అవసరమైతే ప్రత్యేక చట్టాలు తీసుకురావాలని సూచించారు.ఈ కార్యక్రమంలో ఆడహాక్ కమిటీ సభ్యులు సింగం రాజు, పాండు, రవి, నరేందర్ మరియు అనేక మంది జర్నలిస్టులు బాలు, మోహన్ రెడ్డి, జె. సుధాకర్, హుస్సేన్, రోజారాని,సత్యనారాయణ, అరుణ్ కుమార్, దుర్గాప్రసాద్, సురేష్, రామ్ బాబు తదితరులు పాల్గొన్నారు.


Comments