దాన్యం కొనుగోలు కేంద్రంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసినారు

దాన్యం కొనుగోలు కేంద్రంలో అదనపు కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసినారు

మేడ్చల్ మల్కాజ్గిరి, నవంబర్ (తెలంగాణ ముచ్చట్లు)

శామిరపేట్ దాన్యం కొనుగోలు కేంద్రాన్ని అదనపు జిల్లా కలెక్టర్ డి. విజయేందర్ రెడ్డి ఆకస్మికంగా పరిశీలించారు. ఈ తనిఖీలో పౌరసరఫరాల జిల్లా మేనేజర్ ఎల్. సుగుణబాయి, డీఎస్ఓ శ్రీనివాస్ రెడ్డి, డీసీఓ వెంకట్ రెడ్డి, ఏఈఓ అధికారులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా రైతులకు వడ్లను తడి, తాలు, దుమ్ము లేకుండా శుభ్రపరచి, బాగా ఆరబెట్టి కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని సూచించారు. వరి నూర్పిడి యంత్రాల నిర్వాహకులతో మాట్లాడి వరికోత సమయంలో ధాన్యం క్రమబద్ధంగా కొనుగోలు కేంద్రాలకు చేరేలా చర్యలు తీసుకోవాలని తెలిపారు.కొనుగోలు ప్రక్రియను వేగవంతం చేయడానికి తగిన హమాలీలను ఏర్పాటు చేయాలని, వడ్లు దింపుకునే సమయంలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా చూడాలని, కొనుగోలు కేంద్రంలో త్రాగునీటి సదుపాయం కల్పించాలని ఇన్‌చార్జ్‌కి ఆదేశించారు.కొనుగోలు చేసిన వెంటనే రైతుల వివరాలు ట్యాబ్‌లో ఆన్లైన్‌గా నమోదు చేయాలని అధికారులను ఆదేశించారు. రైతులు తమ ధాన్యం అమ్మిన 48 గంటలలోపే డబ్బులు నేరుగా వారి బ్యాంకు ఖాతాల్లో జమ అవుతాయని అదనపు కలెక్టర్ తెలిపారు.IMG-20251121-WA0160

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .