బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులుగా మహిపాల్ రెడ్డి ఏకగ్రీవం ఎన్నిక

కార్యదర్శులుగా కుమారస్వామి

బిఆర్ఎస్ పార్టీ డివిజన్ అధ్యక్షులుగా మహిపాల్ రెడ్డి ఏకగ్రీవం ఎన్నిక

ఏఎస్ రావు నగర్, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
 ఉప్పల్ నియోజకవర్గం కాప్రా సర్కిల్ఏఎస్ రావు నగర్ డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా కాసం మహిపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా పెద్దాపురం కుమారస్వామి వరుసగా రెండోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.శనివారం డాక్టర్ ఏ ఎస్ రావు నగర్‌లోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో నిర్వహించిన డివిజన్ పార్టీ నాయకులు, కార్యకర్తల సమావేశంలో ఈ నిర్ణయాలు తీసుకున్నారుIMG-20251122-WA0065.ఈసమావేశానికి ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి, ఏ ఎస్ రావు నగర్ కార్పొరేటర్ సింగిరెడ్డి శిరీష సోమశేఖర్ రెడ్డి, బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు సింగిరెడ్డి సోమశేఖర్ రెడ్డి, మాజీ కార్పొరేటర్ కొత్త రామారావు తదితరులు హాజరయ్యారు.ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన మహిపాల్ రెడ్డి, కుమారస్వామి మాట్లాడుతూ తమపై మరోసారి విశ్వాసం ఉంచి ఏకగ్రీవంగా ఎన్నుకున్న పార్టీ అధ్యక్షులు కేసీఆర్, వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, మాజీ మంత్రి హరీష్ రావు, ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి, స్థానిక కార్పొరేటర్ శిరీష సోమశేఖర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు మరియు పార్టీ కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.ప్రజా సమస్యల పరిష్కారానికి ఎల్లప్పుడూ కృషి చేస్తామని, పార్టీ నాయకులు–కార్యకర్తలకు నిరంతరం అందుబాటు లో ఉంటామని హామీ ఇచ్చారు. త్వరలో జరగనున్న కార్పొరేషన్ ఎన్నికల్లో ఏ ఎస్ రావు నగర్ డివిజన్‌లో గులాబీ జెండా తప్పకుండా ఎగరవేస్తామని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో బిఆర్ఎస్‌ ను తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి శక్తివంచన లేకుండా పనిచేస్తామని అన్నారు.
తమ ఎన్నికకు సహకరించిన ప్రతి ఒక్కరికి పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్