వీరనారాయణపూర్‌లో ఇందిరమ్మ ఇల్లు నిర్మాణానికి ముగ్గు
ఎల్కతుర్తి, నవంబర్ 22: (తెలంగాణ ముచ్చట్లు):
ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ గ్రామంలో ఇందిరమ్మ ఇల్లు లబ్ధిదారురాలు మండ సరోజనకి కేటాయించిన గృహ నిర్మాణ ప్రదేశంలో శనివారం ముగ్గు పోయడం ద్వారా ఇంటి నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి.
ఈ సందర్భంగా లబ్ధిదారురాలు మండ సరోజన మాట్లాడుతూ,
“కాంగ్రెస్ ప్రభుత్వంతోనే నా సొంత ఇంటి కల నిజమైంది. ఇందిరమ్మ ఇల్లు మంజూరయ్యేలా చర్యలు తీసుకున్న మంత్రి పొన్నం ప్రభాకర్ గారు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులకు, గ్రామ కాంగ్రెస్ కమిటీకి, ఇందిరమ్మ కమిటీ సభ్యులకు హృదయపూర్వక కృతజ్ఞతలు” తెలిపారు.
కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా పలువురు మండల కాంగ్రెస్ నాయకులు హాజరయ్యారు. జిల్లా కాంగ్రెస్ నాయకులు డా. బొల్లెపోగు రమేష్ బాబు, కాంగ్రెస్ పార్టీ హనుమకొండ జిల్లా ప్రధాన కార్యదర్శి వీరమళ్ల రంజిత్ రెడ్డి, ఎల్కతుర్తి సొసైటీ బ్యాంక్ మాజీ చైర్మన్ గోలి రాజేశ్వరరావు, శనిగరం వెంకటేష్, హుస్నాబాద్ యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి ఎర్రోళ్ల చైతన్య, గ్రామ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పుల్లూరి శ్రీధర్ రావు, మండ సుమన్ గౌడ్, మండ వెంకటేశ్వర్లు, నార్లగిరి మొగిలి, నార్లగిరి నర్సింగం, మండ రాజయ్య, గౌడ సంఘం అధ్యక్షులు మండ సారంగం, ఇందిరమ్మ కమిటీ సభ్యులు మండ ఆనందం, పుల్లూరి నర్సింగరావు, చదిరం రాజు, చదిరం జ్యోతి తదితరులు పాల్గొన్నారు.
గ్రామ కార్యదర్శి శ్రీనాథ్, ఫీల్డ్ అసిస్టెంట్ సంపత్, గ్రామపంచాయతీ సిబ్బంది కూడా కార్యక్రమంలో పాల్గొన్నారు.


Comments