సైబర్ మోసాల పట్ల అప్రమత్తం 

పోలీస్ కమిషనర్ సునీల్ దత్ 

సైబర్ మోసాల పట్ల అప్రమత్తం 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 2, తెలంగాణ ముచ్చట్లు;

ఆకర్షణీయమైన ప్రకటనలతో సైబర్ నేరగాళ్లు చేస్తున్న మోసాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని
పోలీస్ కమిషనర్ సునీల్ దత్ సూచించారు. తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ఆధ్వర్యంలో మంగళవారం ప్రారంభమైన "ఫ్రాడ్ కా ఫుల్ స్టాప్" పేరుతో నిర్వహిస్తున్న సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా విస్తృత ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు. ఇప్పటికే ఆటోల ద్వారా మైక్ ల ద్వారా మాల్స్, రైల్వే స్టేషన్స్ బస్టాండ్, రద్దీ ప్రాంతాలలో సైబర్ నేరాలపై ప్రచారం చేస్తున్నట్లు తెలిపారు
ప్రధనంగా డిజిటల్ అరెస్ట్ పేరుతో జరుగుతున్న మోసాల పట్ల మరింత జాగ్రత్తలు పాటించాలని తెలిపారు. అదేవిదంగా నకిలీ ఆన్లైన్ ట్రేడింగ్ యాప్లు, వెబ్ సైట్లు రూపొందించి, తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు వస్తాయని, వాట్సాప్. టెలిగ్రామ్, ఫేస్బుక్, ఇమెయిల్ ద్వారా లింక్ పంపుతూ..మోసపూరిత వాగ్దానాలతో చేసి డబ్బు బదిలీ చేయించుకుని మోసం చేశారని పోలీస్ స్టేషన్లకు ఫిర్యాదులు వస్తున్నాయని, అలాంటి మోసపురిత ఆఫర్లను నమ్మవద్దని విజ్ఞప్తి చేశారు. మోసగాళ్లు పెద్ద కంపెనీ ఐపిఓ వచ్చిందని నమ్మదగిన ప్రకటనలు, నకిలీ వెబ్ సైట్ లు సృష్టిస్తారు. ఆ లింక్ లేదా ఫారమ్ ద్వారా బ్యాంక్ అకౌంట్ వివరాలు, ఆధార్, పాన్ , లేదా యూపీఐ ద్వారా చెల్లింపులు చేయమని చెబుతారు. డబ్బు బదిలీ చేసిన తర్వాత మోసగాళ్లు వెబ్ సైట్ మూసేసి మాయం అవుతారు.కొన్నిసార్లు నకిలీ షేర్ సర్టిఫికేట్లు లేదా రసీదులు కూడా పంపి మోసం చేస్తారు.
సోషల్ మీడియా, వ్యక్తిగత మెసేజ్ ల ద్వారా వచ్చిన ఐ ఓ పి ఆఫర్లను నమ్మవద్దని,
ఎవరైనా ముందుగా “అడ్వాన్స్ పేమెంట్” లేదా “రిజిస్ట్రేషన్ ఫీజు" అడిగితే డబ్బు పంపవద్దని సూచించారు. తక్కువ పెట్టుబడితో లాభాలు వస్తాయని సోషల్ మీడియా, యూట్యూబ్ వీడియోలు, వాట్సాప్ గ్రూపులు లేదా టెలిగ్రామ్ ఛానెల్ ల ద్వారా “రోజుకు వేలల్లో లాభం”, “100% రిటర్న్" అంటూ ప్రకటనలు చేస్తారు. మొదట యాప్ లేదా వెబ్ సైట్లో రిజిస్టర్ చేయమని చెబుతారని, చిన్న మొత్తంలో పెట్టుబడి పెట్టగానే కొంత లాభం చూపించి నమ్మకం కలిగిస్తారని అన్నారు. ఆ తరువాత పెద్ద పెట్టుబడి పెట్టమని ప్రోత్సహిస్తారు. విత్ డ్రా చేయాలంటే “ట్యాక్స్”, “సర్వీస్ చార్జ్” పేరుతో డబ్బు అడుగుతారు. చివరికి వెబ్ సైట్ లేదా యాప్ యాక్సెస్ నిలిపివేసి, డబ్బుతో మాయమవుతారని అన్నారు. ఎవరైనా వీడియో కాల్, వాట్సాప్ లేదా మెసేజ్ ద్వారా పెట్టుబడి పెట్టమని ఒత్తిడి చేస్తే వెంటనే కాల్ కట్ చేసి పిర్యాదు చేయండి.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్