సీసీ రోడ్ అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ముప్పు శ్రీనివాస్ రెడ్డి
నాగారం, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
నాగారం మున్సిపల్ పరిధిలో గోధుమకుంట పారిజాత కాలనీలో రూ.22 లక్షల అంచనా వ్యయంతో డ్రైనేజీ పనులు, సాహితీ హరహర కాలనీలో రూ.7 లక్షలతో సీసీ రోడ్ అభివృద్ధి పనులకు శుక్రవారం భూమిపూజ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ముప్పు శ్రీనివాస్ రెడ్డి, గోధుమకుంట మాజీ ఎంపీటీసీ మంచాల కిరణ్ జ్యోతి ప్రవీణ్ కుమార్ ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా మాట్లాడిన నాయకులు కాలనీల్లో నెలకొన్న సమస్యలను ప్రజల సూచనల మేరకు పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్టు తెలిపారు. అభివృద్ధి పనులు పారదర్శకంగా, నాణ్యత ప్రమాణాలతో చేపట్టాలని అధికారులకు సూచించినట్టు పేర్కొన్నారు.ఈకార్యక్రమంలో గోధుమకుంట మాజీ వార్డు మెంబర్ చీర శేఖర్, కీసర మండల మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు సుమతి, పారిజాత కాలనీ అధ్యక్షులు వెంకట శివ రెడ్డి, సాహితీ హరహర కాలనీ అధ్యక్షులు శ్రీనివాస్, నాయకులు వెంకట్, కిరణ్ గౌడ్తో పాటు స్థానిక కాలనీ వాసులు పాల్గొన్నారు.


Comments