200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
కీసర, డిసెంబర్ 03 (తెలంగాణ ముచ్చట్లు)
కీసర మండల అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 07వ తేదీన నిర్వహించనున్న 200వ వారం జ్ఞానమాల కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తోటకూర వజ్రష్ యాదవ్ ను ఆహ్వానించారు.అంబేద్కర్ సంఘం అధ్యక్షులు కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శి తుడుం శ్రీనివాస్ ప్రత్యేకంగా ఆహ్వానం అందజేశారు.ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు బలిదే రమేష్ గుప్తా, మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ కన్వీనర్ బక్కని నర్సింగ్ రావు, గోధుమకుంట మాజీ ఎంపీటీసీ మంచాల ప్రవీణ్ కుమార్, కీసర మాజీ ఉపసర్పంచ్ తటాకం లక్ష్మణ్ శర్మ, అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బక్కని కుమార్, సంయుక్త కార్యదర్శి కట్ట శంకరయ్య, మాజీ ఉపాధ్యక్షులు బంటు శ్రీనివాస్, కానుకుర్తి ఋషిక్ తదితరులు పాల్గొన్నారు.అంబేద్కర్ భావజాలాన్ని ప్రజల్లో విస్తరించేందు కు కొనసాగుతున్న జ్ఞానమాల కార్యక్రమం 200వ వారానికి చేరుకోవడం పట్ల నాయకులు హర్షం వ్యక్తం చేశారు.


Comments