గ్రంథాలయ వారోత్సవాల్లో భాగంగా గురుకుల పాఠశాలో పుస్తక ప్రదర్శన
వనపర్తి,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా వనపర్తి మండలం చిట్యాల గ్రామంలోని మహాత్మా జ్యోతిబా ఫూలే బాలుర గురుకుల పాఠశాలలో 58వ జాతీయ గ్రంథాలయ వారోత్సవాల సందర్భంగా గురువారం పుస్తక ప్రదర్శనను ఏర్పాటు చేశారు.కార్యక్రమాన్ని ఉద్దేశించి పాఠశాల ప్రిన్సిపల్ ప్రశాంతి మాట్లాడుతూ..చినిగిన చొక్కా అయినా తొడుక్కో… ఒక మంచి పుస్తకం కొనుక్కో అని పుస్తకాల విలువను ఉదహరిస్తూ విద్యార్థులకు అవగాహన కల్పించారు. చిన్ననాటి నుంచే పుస్తక పఠన అలవాటు పెంపొందించుకోవాలని, రోజూ ఏదో ఒక కొత్త విషయం తెలుసుకోవాలని సూచించారు.ఈ సందర్భంగా స్వతంత్ర సమరయోధులపై పుస్తకాలు, విజ్ఞానానికి సంబంధించిన గ్రంథాలు, వినోద పుస్తకాలు, ఆధ్యాత్మిక రచనలు, కవితలు–కథల పుస్తకాలను ప్రదర్శించారు. విద్యార్థులు పుస్తకాలను ఆసక్తిగా వీక్షించారు.ఈ కార్యక్రమంలో స్కూల్ ప్రిన్సిపల్ ప్రశాంతి, లైబ్రేరియన్ డా. రవి, ఏటీపీ పవన్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.


Comments