బాధ్యతలు స్వీకరించిన నూతన డీసీపీలు
రాచకొండ సీపీని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన డీసీపీలు
Views: 7
On
మల్కాజ్గిరి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
రాచకొండ కమిషనరేట్ పరిధిలో మహేశ్వరం డీసీపీగా కే. నారాయణ రెడ్డి ఐపీఎస్, మల్కాజిగిరి డీసీపీగా సిహెచ్. శ్రీధర్ ఐపీఎస్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు చేపట్టిన అనంతరం ఈ ఇద్దరు డీసీపీలు రాచకొండ పోలీసు కమిషనర్ సుధీర్ బాబు ఐపీఎస్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.కే. నారాయణ రెడ్డి గతంలో యాదాద్రి భువనగిరి డీసీపీ, అనంతరం శంషాబాద్ డీసీపీ, తర్వాత వికారాబాద్ జిల్లాలో విధులు నిర్వహించారు. ఇప్పుడు మళ్లీ రాచకొండ కమిషనరేట్‌లో మహేశ్వరం డీసీపీగా బాధ్యతలు స్వీకరించారు.సిహెచ్. శ్రీధర్ అయితే ఇంటెలిజెన్స్విభాగం నుండి మల్కాజిగిరి డీసీపీగా ప్రమోషన్‌పై చేరారు. 
Tags:
Related Posts
Post Your Comments
Latest News
03 Dec 2025 21:50:31
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)
ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...


Comments