రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

రాజీవ్ పార్క్ అభివృద్ధి పనులను పరిశీలించిన కార్పొరేటర్ ప్రభుదాస్

కాప్రా, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ నియోజకవర్గ కాప్రా సర్కిల్ మీర్పేట్ హెచ్‌బీ కాలనీ డివిజన్ పరిధిలోని రాజీవ్ పార్క్‌లో జరుగుతున్న అభివృద్ధి పనులను స్థానిక కార్పొరేటర్ జెరిపోతుల ప్రభుదాస్ సంబంధిత అధికారులతో కలిసి పర్యటించారు. పార్కులో ఏర్పాటు చేస్తున్న గ్రీనరీ పనులతో పాటు వివిధ అభివృద్ధి కార్యక్రమాలను ఆయన ప్రత్యక్షంగా పరిశీలించారు.ఈ సందర్భంగా కార్పొరేటర్ ప్రభుదాస్ మాట్లాడుతూ, పార్కు నిర్మాణాలు వీలైనంత త్వరలో పూర్తిచేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు. పనుల్లో నాణ్యత విషయంలో ఎలాంటి రాజీ పడకుండా, పదికాలాల పాటు నిలబడేలా నాణ్యమైన నిర్మాణాలను చేపడుతున్నామని తెలిపారు.ఇటీవల పార్కులో పాడైన పరికరాల స్థానంలో కొత్త ఓపెన్ జిమ్ ఏర్పాటు చేసినట్లు, చెట్ల చుట్టుపక్కల ఉన్న ఆకులు, కొమ్మలను తొలగించి పార్కును శుభ్రపరిచినట్లు వివరించారు. పచ్చదనం కనువిందుగా ఉండేలా ప్రత్యేక చర్యలు చేపట్టినట్టు తెలిపారు. పార్కును పూర్తిగా అభివృద్ధి చేసి అన్ని సౌకర్యాలతో ప్రజలకు అందుబాటులోకి తేవడమే లక్ష్యమని చెప్పారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ హార్టికల్చర్ అశోక్, సాయి కుమార్, పూస రమేష్, శేఖర్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .