శాస్త్రీయ దృక్పథమే సమాజ ప్రగతికి పునాది  

శాస్త్రవేత్త రిటైర్డ్ ప్రొఫెసర్ రామచంద్రయ్య

శాస్త్రీయ దృక్పథమే సమాజ ప్రగతికి పునాది  

నాగారం, నవంబర్ 21 (తెలంగాణ ముచ్చట్లు)

 జనవిజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన చెకుముకి మండల స్థాయి టాలెంట్ టెస్ట్‌లో పాల్గొన్న వరంగల్ ఎన్ఐటి రిటైర్డ్ ప్రొఫెసర్ రామచంద్రయ్య విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథం, ప్రశ్నించే అలవాటు, పరిశోధనా మైండ్‌సెట్ తప్పనిసరిగా పెంపొందించుకోవాలని సూచించారు. కీసర మండల జనవిజ్ఞాన వేదిక కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం నాగారం ప్రభుత్వ పాఠశాలలో ఈ పరీక్షను నిర్వహించారు.
పరీక్ష ప్రారంభానికి ముందు ప్రధానోపాధ్యాయులు సి హెచ్ రాములు ప్రశ్నాపత్రాలను విడుదల చేశారు. అనంతరం జరిగిన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జన విజ్ఞాన వేదిక సైన్స్ కమ్యూనికేషన్ సబ్ కమిటీ కన్వీనర్ రిటైర్డ్  ప్రొఫెసర్ రామచంద్రయ్య మాట్లాడుతూ.. ఇప్పటి యువతలో శాస్త్రీయ దృక్పథం అత్యంత కీలకం. 8, 9, 10వ తరగతుల్లో మీరు పొందుతున్న విద్య భవిష్యత్తుకు బలమైన పునాది. ప్రశ్నించే స్వభావం, నిజానిజాలను తార్కికంగా విశ్లేషించే అలవాటు, పరిశోధనా దృష్టి, ఇవి ప్రతి విద్యార్థిలో పెరగాలి అని పిలుపునిచ్చారు.
సందేహం వచ్చిన ప్రతిసారీ గురువులను, పుస్తకాలను, విజ్ఞాన వనరులను ఆశ్రయించాలని, అంగీకరించే ముందు ఆలోచించాలి, నమ్మే ముందు పరిశీలించాలన్నారు. కేవలం మార్కులు కోసం కాదు, విజ్ఞానాన్ని ప్రేమించే అలవాటు పెంపొందించడం కోసం చెకుముకి పరీక్షలు కీలకమని చెప్పారు. ఎందుకు? ఎలా?  అనే ప్రశ్నలు ఎప్పటికప్పుడు విద్యార్థుల్లో జీవించి ఉండాలని సూచించారు. తరువాత విద్యార్థులకు బహుమతులు, ప్రశంస పత్రాలు అందజేశారు. జిల్లాస్థాయి చెకుముకి పరీక్షలు నవంబర్ 28న కొంపల్లి సుందర అకాడమీ ఇన్స్టిట్యూషన్‌లో నిర్వహించనున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయికి ఎంపికైన పాఠశాలలు తెలుగు మీడియం నాగారం, కీసర, దమ్మాయిగూడ ప్రభుత్వ పాఠశాలలు. 
 ఇంగ్లీష్ మీడియం నాగారం, కీసర, చీర్యల్ ప్రభుత్వ పాఠశాలలు.  ప్రైవేట్ పాఠశాలలు సెరినిటీ మోడల్ హై స్కూల్ నాగారం, సెరినిటీ మోడల్ హై స్కూల్ కీసర, విఎంఆర్ గ్రామర్ హై స్కూల్ బండ్లగూడ. అలాగే సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ నుండి కుత్బుల్లాపూర్, మల్కాజిగిరి, చార్మినార్, పాఠశాలలు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జనవిజ్ఞాన వేదిక కీసర మండల నాయకులు శేషగిరిరావు,  ఎంఎల్ చౌదరి, కృష్ణ, రాజన్ సింగ్, శ్రీనివాస్, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు.IMG-20251121-WA0168

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్