దేశంలోనే తొలి "ఫిజికల్ ఇంటెలిజెన్స్" నగరంగా హైదరాబాద్ ను అభివృద్ధి చేయనున్న ప్రభుత్వం

దేశంలోనే తొలి

-ఆధునిక సాంకేతికతతో ట్రాఫిక్, అర్బన్ ఫ్లడింగ్, సరస్సుల సంరక్షణకు సమగ్ర పరిష్కారాలు

-ఫిజికల్ ఇంటెలిజెన్స్ పైలట్ ప్రాజెక్ట్‌ను ఎనిమిది వారాలపాటు హైదరాబాద్‌లో అమలు

-సీసీటీవీ వ్యవస్థను రియల్‌టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌గా మారుస్తున్న ప్రభుత్వం

-తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను వివరించిన సిఎం రేవంత్

-సమ్మిట్‌కు అలెక్స్ కిప్‌మన్‌కు ఆహ్వానం సిఎం ఆహ్వానం 


హైదరాబాద్,నవంబర్20(తెలంగాణ ముచ్చట్లు):

హైదరాబాద్‌ను దేశంలోనే అత్యంత నివాసయోగ్య నగరంగా తీర్చిదిద్దడానికి తెలంగాణ ప్రభుత్వం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించనుందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. అనలాగ్ ఏఐ సీఈఓ అలెక్స్ కిప్‌మన్ హైదరాబాద్‌లో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసి, పలు కీలక అంశాలపై చర్చించారు.

సమావేశంలో ట్రాఫిక్ నిర్వహణ, అర్బన్ ఫ్లడింగ్ నివారణ, సరస్సుల సంరక్షణ, వాతావరణ అంచనా, పరిశ్రమల కాలుష్య నియంత్రణ వంటి అంశాలకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా సమగ్ర పరిష్కారాలు తీసుకురావాలనే నిర్ణయానికి వచ్చారు. ‘ఫిజికల్ ఇంటెలిజెన్స్’ ఆధారంగా రియల్‌టైమ్ సెన్సార్ నెట్వర్క్, స్మార్ట్ సిటీ నిర్వహణ పద్ధతులను అమలు చేయవచ్చని అభిప్రాయపడ్డారు.

ఇందులో భాగంగా, హైదరాబాద్ నగరంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్‌ను పైలట్ ప్రాజెక్ట్‌గా ప్రారంభించాలనే నిర్ణయం తీసుకున్నారు. ఎనిమిది వారాలు సాగనున్న ఈ ప్రోగ్రామ్‌లో సీసీటీవీ వ్యవస్థను రియల్‌టైమ్ సిటీ ఇంటెలిజెన్స్ ప్లాట్‌ఫారమ్‌గా మార్చి, ట్రాఫిక్, ప్రజా భద్రత, అత్యవసర సేవలను ఏఐ ఆధారిత అంచనాలతో ఒకే వ్యవస్థలో సమన్వయం చేస్తారు. మొత్తం మానిటరింగ్‌ను ఇంటిగ్రేటెడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా నిర్వహించనున్నారు. పైలట్ పూర్తయ్యే సరికి హైదరాబాద్ దేశంలో తొలి ఫిజికల్ ఇంటెలిజెన్స్ నగరంగా నిలుస్తుందనే అంచనా ఉంది.

భారత్ ఫ్యూచర్ సిటీని పరిశోధన కేంద్రంగా, సుస్థిర పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేయాలనే ప్రభుత్వ సంకల్పాన్ని కూడా సీఎం వివరించారు. తెలంగాణ రైజింగ్ 2047 లక్ష్యాలను అమలు చేయడంలో ఫిజికల్ ఇంటెలిజెన్స్కీలక పాత్ర పోషిస్తుందని అలెక్స్ కిప్‌మన్ అభిప్రాయపడ్డారు.
డిసెంబర్ 8–9 తేదీల్లో జరగనున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్‌కు అలెక్స్ కిప్‌మన్‌ను ముఖ్యమంత్రి ఆహ్వానించారు. IMG-20251120-WA0201

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .