మీనాక్షి నగర్‌లో సీసీ రోడ్డు పనులను పరిశీలించిన మహేష్ గౌడ్
చర్లపల్లి, నవంబర్ 22 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి ఆదేశాల మేరకు చర్లపల్లి డివిజన్ పరిధిలోని మీనాక్షి నగర్‌లో జరుగుతున్న సీసీ రోడ్డు పనులను చర్లపల్లి డివిజన్ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు నేమూరీ మహేష్ గౌడ్ గురువారం పరిశీలించారు.ఈ సందర్భంగా మహేష్ గౌడ్ మాట్లాడుతూ, చర్లపల్లి డివిజన్ సమగ్ర అభివృద్ధికి ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి నిరంతరం కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజల సౌకర్యం కోసం మౌలిక వసతుల విస్తరణకు ప్రాధాన్యతనిస్తూ ప్రభుత్వం పనిచేస్తోందని చెప్పారు.ఈకార్యక్రమంలో సీసీఎస్ ప్రెసిడెంట్ పద్మ రెడ్డి, కాలనీ అధ్యక్షులు సురేష్ గుప్తా, నర్సింగ్ రావు, శ్రీనివాస్ రెడ్డి, గంపా క్రిష్ణ, నర్సింహ రెడ్డి, సిద్దులు, రాఘవ్ రెడ్డి, మహిపాల్ రెడ్డి, పర్షురం గౌడ్, శ్రీనివాస్ నాయక్, ప్రసాద్ రెడ్డి, వెంకటేష్, సాయిబాబా, ముకేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు
.


Comments