11 కె.వి విద్యుత్ తీగల మార్పు కోసం చిలకటోనిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం

11 కె.వి విద్యుత్ తీగల మార్పు కోసం చిలకటోనిపల్లి గ్రామస్తులు ఎమ్మెల్యేకు వినతిపత్రం

పెద్దమందడి,నవంబర్21(తెలంగాణ ముచ్చట్లు):

వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం చిలకటోనిపల్లి  గ్రామస్థులు శుక్రవారం వెల్టూర్ లో వనపర్తి శాసనసభ్యులు తూడి మేఘా రెడ్డిని కలుసి వినతిపత్రం అందజేశారు. గ్రామ మధ్యలో ఉన్న 11 కె.వి విద్యుత్ వైర్లు ప్రమాదాలకు కారణమవుతున్నాయి. ఈ కారణంగా గ్రామస్తులు పలుమార్లు ప్రమాదానికి గురవుతున్నారని, విద్యుత్ వైర్లను గ్రామానికి దూరంగా, శాశ్వత మార్గంలో ఏర్పాటు చేయాలని కోరారు.గ్రామ నాయకులు  విక్రమ్ రెడ్డి, బాజ శ్రీనివాస్ ఎమ్మెల్యే ను కలిసి 11 కె.వి విద్యుత్ మార్గం ఏర్పాటు చేయడానికి దాదాపు మూడు లక్షల రూపాయల ఖర్చు అవుతుందని, ఆ నిధులను ప్రభుత్వం మంజూరు చేయాలని వారు సూచించారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి సానుకూలంగా స్పందిస్తూ.. విద్యుత్ శాఖ డిప్యూటీ ఇంజినీర్‌తో మాట్లాడి 11 కె.వి విద్యుత్ వైర్లను శాశ్వత మార్గంలో మార్చేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.అలాగే, చిలకటోనిపల్లి గ్రామ రైతులు ఎమ్మెల్యేను కలసి, వ్యవసాయ భూములకు వెళ్లే మార్గాలను సౌకర్యవంతంగా ఏర్పాటు చేయాలని కోరారు. రైతులు తెలిపారు, గ్రామంలోని వెనకభాగ భూములకు చేరుకోవడానికి సరైన దారి ఏర్పాటు అవసరం. ఎమ్మెల్యే మేఘా రెడ్డి ఈ సూచనను స్వీకరించి, రైతుల భూములకు రోడ్డు మార్గాలను సులభంగా కల్పించడానికి ప్రత్యేక నిధులను ఉపయోగించి చర్యలు తీసుకోవాలని హామీ ఇచ్చారు. ఎవరైనా ఇబ్బంది కలిగిస్తే తక్షణమే ఫిర్యాదు చేయవచ్చని ఆయన రైతులను సూచించారు.ఈ కార్యక్రమంలో వెల్టూర్ మాజీ సర్పంచ్ శ్రీనివాస్ రెడ్డి, గ్రామ కాంగ్రెస్ పార్టీ మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, చిలక టోనీ పల్లి విక్రం రెడ్డి, బాజ శ్రీను, గ్రామస్తులు కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు  స్థానిక అధికారులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం దామెర గ్రామ రాజకీయాల్లో కీలక పరిణామం
ఎల్కతుర్తి, డిసెంబర్ 03(తెలంగాణ ముచ్చట్లు)  ఎల్కతుర్తి మండలంలోని దామెర గ్రామంలో బుధవారం బీజేపీ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో గ్రామ రాజకీయాల్లో విశేష మార్పు చోటుచేసుకుంది. దామెర...
వికలాంగ అనాధ చిన్నారులకు అల్టిట్యూడ్ విద్యార్థుల చేయూత
నేడు విద్యుత్ సరఫరా అంతరాయం
అంగన్వాడీ ఖాళీ పోస్టులు వెంటనే భర్తీ చేయాలని డిమాండ్
200వ జ్ఞానమాల కార్యక్రమానికి వజ్రష్ యాదవ్‌కు ఆహ్వానం
గ్లోబల్ సమ్మిట్ బందోబస్త్ ఏర్పాట్లను సమీక్షించిన ఏడీజీ మహేష్ భగవత్ ఐపీఎస్
దుర్గామాత దేవాలయం నవమ  బ్రహ్మోత్సవాల్లో పాల్గొన్న నెమలి అనిల్