మహిళా కార్మికులకు న్యాయబద్ధంగా వేతనాలు పెంచాలి
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి
నాచారం, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
మహిళా కార్మికులకు న్యాయబద్ధంగా వేతనాలు పెంచాలని ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.వేతనాలు న్యాయంగా పెంచే వరకు ఉద్యమం కొనసాగుతుందని ఆయన స్పష్టం చేశారు.శనివారం నాచారం పారిశ్రామిక వాడలోని షాహీ ఎక్స్పోర్ట్స్ కంపెనీ వద్ద మహిళా కార్మికులకు వేతనాలు పెంచాలని, కార్మికులపై జరుగుతున్న వేధింపులను అరికట్టాలని కోరుతూ నిర్వహించిన ధర్నాలో ఎమ్మెల్యే పాల్గొని కార్మికులతో కలిసి నిరసన వ్యక్తం చేశారు.కార్మికుల పాలిట గుదిబండగా మారిన జీఓ నంబర్ 44ను వెంటనే సవరించి, వేతనాలు పెంచాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. మహిళా కార్మికుల కష్టాన్ని ప్రభుత్వం, యాజమాన్యం గుర్తించి న్యాయం చేయాలని అన్నారు.ఈ సందర్భంగా స్పందించిన కంపెనీ జీఎం మురళి మాట్లాడుతూ, వేతనాల పెంపు తమ పరిధిలో లేదని, ఈ విషయాన్ని యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు, కార్మికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. 


Comments