ప్రజా ఉద్యమాలకు స్ఫూర్తిదాయకంగా టీపీఎస్‌కే రచనలు గొడుగు యాదగిరిరావు
ఏ ఎస్ రావు నగర్, డిసెంబర్ 13 (తెలంగాణ ముచ్చట్లు):
తెలంగాణ ప్రజా సాంస్కృతిక కేంద్రం (టీపీఎస్‌కే) స్ఫూర్తి గ్రూపు ఆధ్వర్యంలో వెలువడిన స్ఫూర్తి గ్రూపు రచనలు – పూర్తి వ్యాస సంకలనం, మేము సైతం.. వ్యాస సంకలనంతో పాటు రామ్‌శెట్టి రోశయ్య రచించిన పుస్తకాలను తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ కార్మిక సంఘం ఉపాధ్యక్షులు బి. ప్రసాద్‌కు శనివారం ఉదయం కమలానగర్ కార్యాలయంలో అందజేశారు.క్లాస్ బోధన నిమిత్తం కార్యాలయానికి వచ్చిన సందర్భంగా ఈ పుస్తకాలను స్ఫూర్తి గ్రూపు నాయకులు గొడుగు యాదగిరిరావు, శ్రీమన్నారాయణ, కృష్ణమాచార్యులు, గిరీష్, మొహమ్మద్ తదితరులు ఆత్మీయంగా అందజేశారు.ఈ సందర్భంగా గొడుగు యాదగిరిరావు మాట్లాడుతూ ప్రజా ఉద్యమాల్లో చురుకైన పాత్ర పోషిస్తూ వ్యవసాయ కార్మిక సంఘాన్ని బలమైన వర్గ సంఘంగా అభివృద్ధి చేస్తున్న బి. ప్రసాద్‌ను అభినందించారు. అలాగే అనేక ప్రజా సంఘాలకు స్ఫూర్తిదాయకంగా కృషి చేస్తున్నందుకు ప్రశంసలు తెలియజేశారు.అనంతరం బి. ప్రసాద్ మాట్లాడుతూ నేటి పరిస్థితుల్లో టీపీఎస్‌కే స్ఫూర్తి గ్రూపు గొప్ప మేధోపరమైన కృషి చేస్తున్నదని అన్నారు. వారి రచనలు భవిష్యత్తులో మరిన్ని ప్రజా ఉద్యమాలకు దోహదపడేలా ఉండాలని ఆకాంక్షించారు. స్ఫూర్తి సంబంధిత పుస్తకాలను అందజేసినందుకు ధన్యవాదాలు తెలిపారు.ఈ కార్యక్రమంలో ఎం. శ్రీనివాసరావు, ఉమామహేశ్వరరావు, శ్రీమన్నారాయణ, గిరీష్, కృష్ణమాచార్యులు, మొహమ్మద్ తదితరులు పాల్గొన్నారు.


Comments