నామినేషన్ కార్యక్రమంపై పర్యవేక్షణ
Views: 2
On
వేలేరు, 04 డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు):
వేలేరు మండలం కన్నారం గ్రామంలో నామినేషన్ ప్రక్రియ సజావుగా కొనసాగుతున్న నేపథ్యంలో, వేలేరు ఎస్సై సురేష్ ఆధ్వర్యంలో ధర్మసాగర్ సిఐ శ్రీధర్ నామినేషన్ సరళిని పర్యవేక్షించారు. గ్రామంలో ఏర్పాటైన బందోబస్తు, భద్రతా ఏర్పాట్లు, క్యూలైన్లు, నియమాలు పాటిస్తున్న విధానంపై పరిశీలించారు.
తద్వారా నామినేషన్ బందోబస్త్ డ్యూటీలో ఉన్న ఆఫీసులకు బ్రీఫింగ్ ఇచ్చి, ఎన్నికల కోడ్ అమలు, శాంతి భద్రతల పరిరక్షణలో ఎలాంటి అలసత్వం లేకుండా వ్యవహరించాలని సూచించారు. గ్రామంలో ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా సమన్వయంతో పనిచేయాలని సిబ్బందికి ఆదేశాలు ఇచ్చారు.
ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది, గ్రామస్థులు పాల్గొన్నారు. అధికారులు గ్రామంలోని ప్రధాన ప్రాంతాలను సందర్శించి భద్రతా చర్యలను మరింత బలపరిచారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments