నాచారం డివిజన్ పునర్విభజనపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

నాచారం డివిజన్ పునర్విభజనపై బీఆర్ఎస్ నాయకుల ఆందోళన

నాచారం, డిసెంబర్ 12 (తెలంగాణ ముచ్చట్లు):

గ్రేటర్ హైదరాబాద్‌ను 300 డివిజన్లుగా పునర్విభజించిన నేపథ్యంలో నాచారం డివిజన్‌ను మెయిన్ రోడ్డును ఆధారంగా చేసుకొని రెండు కొత్త డివిజన్లుగా — హెచ్ఎంటి నగర్ మరియు నాచారం — విభజించారు. పాత నాచారం బౌండరీలతోనే హెచ్ఎంటి నగర్ డివిజన్ ఏర్పడినందున అక్కడ ఎలాంటి అభ్యంతరాలూ లేవని స్థానిక నేతలు తెలిపారు.అయితే, పాత నాచారం డివిజన్ పరిధిలో ఉన్న కొన్ని కాలనీలు తార్నాక డివిజన్‌లో పొందుపరిచినట్లు గుర్తించామని, ఆ కాలనీలన్నిటినీ తిరిగి నూతనంగా ఏర్పాటైన నాచారం డివిజన్‌కే చేర్చాలని జిహెచ్ఎంసి ఏర్పాటు చేసిన అభ్యంతరాల డెస్క్‌కు వినతిపత్రం సమర్పించినట్టు బీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకుడు సాయిజెన్ శేఖర్ తెలిపారు.ఈ మేరకు ముందుగా ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డితో కలిసి జోనల్ కమిషనర్ హేమంత్ కేశవ్ పాటిల్‌ను కలిసి సమస్యను వివరించామని, ఆయన సానుకూలంగా స్పందించి “నాచారం నుండి ఒక్క కాలనీ కూడా తార్నాకకు వెళ్లకుండా చూస్తాను” అని హామీ ఇచ్చినట్టు శేఖర్ తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .