కల్వకుంట్ల కవిత జనంబాట కార్యక్రమం ర్యాలీ లో పాల్గొన్నారు
కాప్రా, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా డివిజన్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చేపట్టిన జనంబాట కార్యక్రమం బుధవారం కాప్రా సర్కిల్‌లో ఉత్సాహంగా కొనసాగింది. ఈసీఐఎల్ చౌరస్తా నుంచి సైనిక్‌పురి వరకు యువ నాయకుడు గోగికర్ నవీన్‌కుమార్ ఆధ్వర్యంలో భారీ ట్రాక్టర్ ర్యాలీ నిర్వహించగా, స్థానికులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.జనంతో నడుస్తూ కవిత ప్రజలను ప్రత్యక్షంగా కలుసుకొని వారి సమస్యలు తెలుసుకున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ ప్రజా సమస్యలను పట్టించుకోని స్థానిక ఎమ్మెల్యేపై కవిత తీవ్ర విమర్శలు చేశారు.
మహా కుంభమేళా, శ్రీకృష్ణాష్టమి ఘటనల్లో మృతుల కుటుంబాలను పరామర్శించడంలో ఎమ్మెల్యే, ఎంపీ పూర్తిగా నిర్లక్ష్యం చేశారని ఆమె ఆక్షేపించారు. కేంద్రం ప్రకటించిన రెండులక్షల పరిహారం ఇప్పటికీ అందకపోవడం దురదృష్టకరమ
న్నారు. బాధిత కుటుంబాలకు ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీలు కూడా అమలు కాలేదని పేర్కొన్నారు.ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళా పథకాలు బలహీనంగా నడుస్తున్నాయని, అనేక లబ్ధిదారులు సరైన ప్రయోజనం పొందలేక పోతున్నారని కవిత అన్నారు.మహిళలు, యువత పెద్ద ఎత్తున పాల్గొనడంతో జనంబాట కార్యక్రమంకాప్రాలో సందడిగా సాగింది.


Comments