ఉప్పల్ కాలభైరవ స్వామి దేవాలయంలో మూడో వార్షికోత్సవ వేడుకలు
Views: 5
On
ఉప్పల్, డిసెంబర్12 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ భగయత్‌లో గల కాలభైరవ స్వామి దేవాలయం నిర్వహించిన మూడో వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ప్రత్యేక పూజలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు బన్నాల ప్రవీణ్ ముదిరాజ్, అలాగే పార్టీ నాయకులు పాల్గొని స్వామివారి ఆశీర్వాదాలు పొందారు.అనంతరం మాట్లాడిన బన్నాల ప్రవీణ్ ముదిరాజ్ మాట్లాడుతూ,“కాలభైరవ స్వామి ఆశీస్సులతో ఉప్పల్ నియోజకవర్గ ప్రజలందరూ సుఖసంతోషాలతో సుభిక్షంగా ఉండాలి” అని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో బిఆర్ఎస్ పార్టీ నాయకులు నిరంజన్, బంటి గౌడ్, జ్ఞానేశ్వర్ గౌడ్, బరంపేట్ మురళి ముదిరాజ్, చింతల్ నర్సింహారెడ్డి, రాజశేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
13 Dec 2025 21:23:59
పెద్దమందడి,డిసెంబర్13(తెలంగాణ ముచ్చట్లు):
వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...


Comments