ఖమ్మం జూనియర్ కబడ్డీ జట్టుకు కిట్ల పంపిణీ

రాష్ట్రస్థాయిలో మెరిసేయాలని దయాకర్ రెడ్డి పిలుపు

ఖమ్మం జూనియర్ కబడ్డీ జట్టుకు కిట్ల పంపిణీ

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 4, తెలంగాణ ముచ్చట్లు;

మహబూబ్‌నగర్‌లో ఈ నెల 5 నుంచి నుంచి ప్రారంభమయ్యే జూనియర్ బాలుర తెలంగాణ రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు ఖమ్మం జిల్లా జట్టు సిద్ధమైంది. ఈ నెల 5 నుంచి 7 వరకు జరిగే ఈ పోటీల్లో పాల్గొననున్న ఖమ్మం జట్టుకు తుంబూరు దయాకర్ రెడ్డి ప్రత్యేకంగా కబడ్డీ కిట్లను అందజేశారు.

ఈ సందర్భంగా దయాకర్ రెడ్డి మాట్లాడుతూ… ఖమ్మం జట్టు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ ప్రదర్శన చేసి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఎక్కువమంది యువ క్రీడాకారులు ఎంపికయ్యేలా శ్రమించాలని సూచించారు. జట్టుకు మెరుగైన సాధన కోసం మ్యట్‌ను కూడా ఏర్పాటు చేస్తామని దయాకర్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కటికల క్రిస్టాఫర్ బాబు తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .