నామినేషన్ కేంద్రాలపై ఏసీపీ వసుంధర యాదవ్ పర్యవేక్షణ.!
Views: 22
On
సత్తుపల్లి, డిసెంబర్ 04 (తెలంగాణ ముచ్చట్లు):
గ్రామ పంచాయతీ ఎన్నికల నామినేషన్ల నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లను పటిష్టం చేయాలని సూచిస్తూ కల్లూరు ఏసీపీ వసుంధర యాదవ్ గురువారం రుద్రాక్షపల్లి, గంగారం, బేతుపల్లి నామినేషన్ కేంద్రాలను సందర్శించారు. నామినేషన్ సెంటర్ల వద్ద విధులు నిర్వహిస్తున్న సిబ్బందితో ఏసీపీ మాట్లాడి ప్రజల రాకపోకలు, అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియలో ఎలాంటి అంతరాయం లేకుండా పర్యవేక్షించాలని సూచించారు. కేంద్రాల వద్ద అప్రకటిత గుంపులు చేరకుండా పహారా బిగించాలని, వివాదాస్పద పరిస్థితులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.
ఈ పర్యటనలో సత్తుపల్లి ఎస్‌హెచ్‌ఓ తుమ్మలపల్లి శ్రీహరి, సెక్టర్ ఎస్సై వీర ప్రసాద్ పాల్గొన్నారు.
Tags:
Related Posts
Post Your Comments
Latest News
15 Dec 2025 22:06:53
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...


Comments