దివ్యాంగుల జిల్లా స్థాయి సమన్వయ సమావేశం
మేడ్చల్ మల్కాజ్గిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
జిల్లా అదనపు కలెక్టర్ ఆదేశాల మేరకు, మహిళా, శిశు, దివ్యాంగులు & వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో దివ్యాంగుల జిల్లా స్థాయి సమన్వయ సమావేశం సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయ ఆవరణలో నిర్వహించబడింది.ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా వివిధ జిల్లా శాఖల ముఖ్య అధికారులు హాజరై, దివ్యాంగులు జిల్లా స్థాయిలో ఎదుర్కొంటున్న సమస్యలను తెలుసుకుని, వాటిపై అవగాహన కల్పించారు. సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై స్పష్టమైన దిశానిర్దేశం చేశారు.అనంతరం జిల్లా సంక్షేమ అధికారిణి (మహిళా, శిశు, దివ్యాంగులు & వయోవృద్ధుల సంక్షేమ శాఖ),మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా మాట్లాడుతూ, దివ్యాంగుల సంక్షేమానికి శాఖ నిరంతరం కృషి చేస్తోందని తెలిపారు. వారి సమస్యలను సాధ్యమైనంత త్వరగా పరిష్కరించేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి శారద, జిల్లా డిఆర్డిఓ అధికారి సాంబశివరావు, జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి వినోద్ కుమార్, జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్, డిఈఓ, డిఎం&హెచ్ఓ సిబ్బంది పాల్గొన్నారు. అలాగే అసోసియేషన్ ప్రతినిధులు కిరణ్, వెంకట్, వినయ్, శ్రీనివాస్ రెడ్డి, శివకృష్ణ, టైగర్ నరసింహ, శంకర్ నాయక్, నాగరాజు, శ్రీశైలం, నాగలక్ష్మి తదితరులు హాజరయ్యారు.ఇక ఎన్జిఓ ప్రతినిధులుగా ఉమర్ ఖాన్, మధుసూదన్ రెడ్డి, పాపారావు, శ్యామ్ సుందర్పాల్గొనగా, డిడబ్ల్యుఓ కార్యాలయ సిబ్బంది మరియు ఇతరులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. 


Comments