పామిరెడ్డిపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం

పామిరెడ్డిపల్లి గ్రామ సమగ్ర అభివృద్ధే లక్ష్యం

పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి మండలం పామిరెడ్డిపల్లి గ్రామాన్ని సమగ్రంగా అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే తన ప్రధాన లక్ష్యమని పామిరెడ్డిపల్లి గ్రామ సర్పంచ్ మధిర మంజుల శ్రీశైలం తెలిపారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన విశ్వాసానికి తగ్గట్టుగా పనిచేస్తూ, గ్రామాభివృద్ధే కేంద్రబిందువుగా పాలన సాగిస్తానని పేర్కొన్నారు.గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, రహదారులు, డ్రైనేజీ, వీధిదీపాలు, విద్య, వైద్యం, పచ్చదనం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి తొలి ప్రాధాన్యత ఇస్తామని ఆయన తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను గుర్తించి దశలవారీగా పరిష్కరిస్తూ ప్రజలకు మెరుగైన సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు.పేదలు, రైతులు, మహిళలు, యువతకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని, ప్రతి ఇంటికీ ప్రభుత్వ లబ్ధి చేరేలా పారదర్శకంగా వ్యవహరిస్తామని సర్పంచ్ స్పష్టం చేశారు.ఈ సందర్భంగా  ఆమె మాట్లాడుతూ.. స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి  సహకారంతో గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు సమకూర్చి పామిరెడ్డిపల్లి గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టంగా తెలిపారు.గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉండి, గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యంతో పామిరెడ్డిపల్లిని ఆదర్శ గ్రామంగా నిలబెడతామని మధిర మంజుల శ్రీశైలం ధీమా వ్యక్తం చేశారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .