నాచారంలో దోమల నియంత్రణకు చర్యలు
హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువును పర్యవేక్షించిన కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్
నాచారం, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ పరిధిలో దోమలు విపరీతంగా పెరుగుతున్న నేపథ్యంలో నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్ ఎంటమాలజీ సిబ్బందితో కలిసి హెచ్‌ఎంటీ నగర్ పెద్ద చెరువును పర్యవేక్షించారు.ఈ సందర్భంగా పెద్ద చెరువులో గుర్రపు డెక్క విపరీతంగా పెరిగిందని, దాని కారణంగానే ఇటీవల కాలంలో దోమల సంఖ్య అధికంగా పెరిగిందని కార్పొరేటర్ గుర్తించారు. వెంటనే గుర్రపు డెక్కను పూర్తిగా తొలగించేందుకు ప్రత్యేక మిషన్ ఏర్పాటు చేయాలని ఎస్‌ఈ ఎంటమాలజీ మాధవరెడ్డిని ఫోన్ ద్వారా సూచించారు.దీనికి స్పందించిన ఎస్‌ఈ ఎంటమాలజీ మాధవరెడ్డి, త్వరలోనే ఎఫ్‌టీసీ మిషన్‌ను తీసుకువచ్చి గుర్రపు డెక్కను పూర్తిగా తొలగిస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో ఎంటమాలజీ సూపర్వైజర్ నరసింహ, బీఆర్‌ఎస్ నాయకులు కట్ట బుచ్చన్న గౌడ్, చంద్రశేఖర్, దాసరి కర్ణ, మక్బూల్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.


Comments