కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు

పెండింగ్ అర్జీలను తక్షణమే పరిష్కరించాలి: అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి

కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు

మేడ్చల్–మల్కాజిగిరి కలెక్టర్, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):

మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యల అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ విజయేందర్ రెడ్డి, లా ఆఫీసర్ చంద్రావతితో కలిసి స్వీకరించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్ కార్యాలయం లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో మొత్తం 107 ఫిర్యాదులు అందినట్లు తెలిపారు.ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ, ప్రజావాణి కార్యక్రమంలో ప్రజలు అందజేసే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు సీరియస్‌గా తీసుకుని తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాల్సిందిగా ఆదేశించారు. స్వీకరించిన దరఖాస్తులను పరిశీలించి వెంటనే తదుపరి చర్యలు చేపట్టాలని సూచించారు.వినతుల పై చేపట్టిన చర్యలను ఆన్‌లైన్ పోర్టల్‌లో అప్లోడ్ చేయాలని, అలాగే ఆన్‌లైన్‌లో పెండింగ్‌లో ఉన్న దరఖాస్తుల ను సంబంధిత శాఖల అధికారులు వెంటనే క్లియర్ చేయాలని తెలిపారు.ప్రజావాణిలో స్వీకరించిన అర్జీలను పెండింగ్‌లో పెట్టకుండా ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ సమస్యలకు పరిష్కారం చూపాలని అధికారులకు స్పష్టం చేశారు.అదేవిధంగా సీఎంఓ ప్రజావాణికి సంబంధించిన పెండింగ్ కేసులను కూడా వేగవంతంగా పరిష్కరించాలని వివిధ శాఖల అధికారులను అదనపు కలెక్టర్ ఆదేశించారు.ఈ కార్యక్రమం లో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.IMG-20251215-WA0093

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .