వెల్టూర్ గ్రామాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తాం
వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ (చిట్టి)
పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం వెల్టూర్ గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ప్రజలకు మెరుగైన మౌలిక సదుపాయాలు అందించడమే తమ ప్రధాన లక్ష్యమని వెల్టూర్ గ్రామ సర్పంచ్ అశోక్ (చిట్టి) తెలిపారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తూ, అభివృద్ధే అజెండాగా పాలన సాగిస్తానని స్పష్టం చేశారు.గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, అంతర్గత రహదారులు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిదీపాలు, విద్యా–వైద్య సౌకర్యాల అభివృద్ధితో పాటు పచ్చదనం పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని ఆయన అన్నారు. గ్రామ సమస్యలను ప్రజలతో చర్చించి ప్రాధాన్యత క్రమంలో పరిష్కరిస్తామని పేర్కొన్నారు.పేదలు, రైతులు, మహిళలు, యువతకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు అర్హులైన ప్రతి ఒక్కరికీ అందేలా కృషి చేస్తామని, గ్రామ పాలనలో పారదర్శకత, బాధ్యతాయుతమైన నిర్ణయాలే మార్గదర్శకమని సర్పంచ్ అశోక్ (చిట్టి) అన్నారు.గ్రామ ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ, వారి సహకారంతో వెల్టూర్‌ను అభివృద్ధి పథంలో ముందుకు తీసుకెళ్లి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.


Comments