ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు... 

జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

ప్రశాంతంగా రెండవ విడత పంచాయతీ ఎన్నికలు... 

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ -14(తెలంగాణ ముచ్చట్లు)

రెండవ విడత గ్రామ పంచాయతీ ఎన్నికలు ఆదివారం ఖమ్మం జిల్లాలోని 6 మండలాల్లో ప్రశాంతంగా నిర్వహించినట్లు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు. 
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి మాట్లాడుతూ రెండవ విడత 160 గ్రామ పంచాయతీలకు, 1379 వార్డులకు నిర్వహించిన పోలింగ్ లో 91.21 శాతం మంది తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని అన్నారు. ఉదయం 9 గంటల వరకు 27.78 శాతం, 11 గంటలకు 64.32 శాతం, 1 గంట వరకు 85.95 శాతం పోలింగ్ నమోదైందని, ఒంటి గంట వరకు పోలింగ్ కేంద్రాలకు చేరుకున్న ఓటర్లకు టోకెన్ అందించి ఓటు హక్కు వినియోగించుకునే అవకాశం కల్పించామని,  వారితో కలిపి మొత్తం ఖమ్మం జిల్లాలో 91.21 శాతం పోలింగ్ నమోదైందని అన్నారు. ‌ రెండవ విడత పోలింగ్ నిర్వహించిన కామేపల్లి మండలంలో 87.03 శాతం, ఖమ్మం రూరల్ మండలంలో 93.76 శాతం, కూసుమంచి మండలంలో 90.92 శాతం, ముదిగొండ మండలంలో 91.52 శాతం, నేలకొండపల్లి మండలంలో 91.69 శాతం, తిరుమలాయపాలెం మండలంలో 91.57 శాతం పోలింగ్ నమోదైందని, మొత్తం 2 లక్షల 48 వేల 239 మంది ఓటర్లకు గాను 2 లక్షల 26 వేల 417 మంది ఓటర్లు తమ ఓటు హక్కును సద్వినియోగం చేసుకున్నారని, మొత్తంగా రెండవ విడతలో 91.21 శాతం పోలింగ్ నమోదు అయినట్లు కలెక్టర్ అన్నారు.
ప్రశాంతంగా ఎన్నికలు జరిగేలా కలెక్టరేట్ నుంచి నిరంతరం మానిటరింగ్ చేయడం జరిగిందని, ప్రతి గ్రామ పంచాయతీ పరిధిలో కౌంటింగ్ ముగిసిన తర్వాత ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాటు చేశామని కలెక్టర్ తెలిపారు. 
అంతకుముందు జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి కలెక్టరేట్ లోని వెబ్ కాస్టింగ్ మానిటరింగ్ సెల్ ద్వారా 6 మండలాల్లో జరుగుతున్న పోలింగ్ సరళిని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ వెంట డి.ఆర్.ఓ. ఏ. పద్మశ్రీ, సిపిఓ ఏ. శ్రీనివాస్, కలెక్టరేట్ ఏఓ కె. శ్రీనివాస రావు, రెవెన్యూ సిబ్బంది,
టెక్నికల్ టీం సభ్యులు, సంబంధిత అధికారులు, తదితరులు పాల్గొన్నారు.IMG-20251214-WA0050

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి