ప్రీ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల 

ప్రీ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న కార్పొరేటర్ బన్నాల 

ఉప్పల్, డిసెంబర్ (తెలంగాణ ముచ్చట్లు)

ఉప్పల్ డివిజన్ కేకేఆర్ గార్డెన్, భరత్ నగర్‌లో నిర్వహించిన ప్రీ క్రిస్మస్ ప్రత్యేక ప్రార్థన, అలాగే 14వ సముద్ర జల ప్రవాహాల పండుగ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా చిల్కానగర్ డివిజన్ కార్పొరేటర్, జిహెచ్ఎంసి స్టాండింగ్ కమిటీ మాజీ సభ్యురాలు బన్నాల గీతా ప్రవీణ్ ముదిరాజ్ పాల్గొన్నారు.అనంతరం మాట్లాడిన కార్పొరేటర్ గీతా ప్రవీణ్ మాట్లాడుతూ—ప్రతి సంవత్సరం హోలీ టెంపుల్ బ్రదర్ జె. తేజు మై వారి ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా జరుగుతున్న ప్రీ క్రిస్మస్ కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో ప్రభువుకు సేవకులు పాల్గొనడం ఆనందకరమన్నారు. ప్రభువు ఆశీస్సులతో అందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు.తనను కార్పొరేటర్‌గా నిలబెట్టిన ప్రతి సోదరి, సోదరులకు కృతజ్ఞతలు తెలుపుతూ—డివిజన్ పరిధిలోని ప్రతి ప్రార్థన మందిరానికి తాను పూర్తి సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు.అలాగే, గతంలో కెసిఆర్ ప్రభుత్వంలో ప్రతి క్రిస్టియన్ కుటుంబానికి క్రిస్మస్ గిఫ్టులు అందించగా, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ కార్యక్రమాన్ని నిర్లక్ష్యం చేస్తోందని పేర్కొన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రతి అర్హుడికి క్రిస్మస్ గిఫ్టులు అందేలా చూడాలని కోరారు.కార్యక్రమంలో పాస్టర్ గోనె ఫిలిప్స్, పలు ప్రార్థన మందిరాల పాస్టర్లు మరియు ఇతర విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.IMG-20251205-WA0202

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .