ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

ప్రశాంతంగా ముగిసిన రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌

*కొన్నసాగుతున్న ఓట్ల లెక్కింపు పక్రియ... గ్రామాలలో కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు*

----- *పోలీస్ కమిషనర్ సునీల్ దత్*

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 14,(తెలంగాణ ముచ్చట్లు)

జిల్లాలో జరుగుతున్న రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల పోలింగ్‌ ప్రశాంతంగా ముగిసిందని పోలీస్ కమిషనర్ సునీల్ దత్ తెలిపారు.  ఖమ్మం రూరల్ మండలం కామంచికల్లు, తీర్థాల, గోళ్ళపాడు, ముదిగొండ, నేలకొడపల్లి, ముజ్జిగుడెం,రాజేశ్వరపురం, కూసుమంచి, జల్లేపల్లి, దమ్మాయిగూడెం, తిరుమలాయపాలెం గ్రామాలను  సందర్శించిన 
పోలీస్ కమిషనర్ బందోబస్త్ ఏర్పాట్లను పరిశీంచారు. 

ఈ సందర్బంగా పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. పోలింగ్ కేంద్రాలకు తరలివచ్చి ఓటర్లు స్వేచ్ఛగా తమ ఓటు హక్కునువినియోగించుకున్నారని పేర్కొన్నారు. ఒంటి గంట వరకు వచ్చి క్యూలైన్‌లో ఉన్న వారందరికీ ఓటు వేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు.

పోలింగ్‌ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పట్టిస్టమైన బందోబస్త్ తో పోలీస్ అధికారులు పర్యవేక్షించారని అన్నారు.
 
ఓట్ల లెక్కింపు పక్రియ సమయంలో ఎలాంటి గొడవలు జరగకుండా ఉండేందుకు గ్రామాలలో ముందస్తు జాగ్రత్తలతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేయడం జరిగిందని తెలిపారు. ఓట్ల లెక్కింపు కేంద్రం వద్ద ఎక్కువ మందిని గుంపులుగా లేకుండా చర్యలు తీసుకున్నారు. ప్రశాంతంగా వున్న గ్రామాల్లో సమస్య సృష్టించే వ్యక్తులను ముందుస్తుగానే బైండోవర్ చేసినట్లు తెలిపారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి