పెద్దమందడి గ్రామ బిఆర్ఎస్ అభ్యర్థి స్వాతి విజయం కోసం ప్రచారం

పెద్దమందడి గ్రామ బిఆర్ఎస్ అభ్యర్థి స్వాతి విజయం కోసం ప్రచారం

పెద్దమందడి, డిసెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):

పెద్దమందడి గ్రామంలో బిఆర్ఎస్ పార్టీ బలపర్చిన సర్పంచ్ అభ్యర్థి స్వాతి హరి కుమార్ రెడ్డి గెలుపు కోసం టిఆర్ఎస్ నాయకులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. జిల్లా అధ్యక్షులు గట్టు యాదవ్ మరియు జిల్లా అధికార ప్రతినిధి వాకిటి శ్రీధర్ నేతృత్వంలో పెద్దమందడి మండల కేంద్రంలోని టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు సేనపతి స్వగృహంలో శుక్రవారం విలేకరుల సమావేశం నిర్వహించారు.ఈ సందర్భంగా గట్టు యాదవ్ మాట్లాడుతూ.. పంచాయతీలను నిర్వహించడంలో కాంగ్రెస్ పార్టీ విఫలమై, గతంలో కె.సి.ఆర్ గల మౌలిక వసతులు, పరిశుభ్రతా కార్యక్రమాలను మురికి కూపంగా మార్చినట్లు విమర్శించారు.వాకిటి శ్రీధర్ మాట్లాడుతూ.. గ్రామాలలో ఆసరా పింఛన్లు, కళ్యాణ లక్ష్మీ, కె.సి.ఆర్ కిట్టు, వైకుంఠ ధామాలు, రైతులకు సాగు నీరు వంటి సంక్షేమ పథకాలు సమయానికి అమలు చేసిన ఘనత కె.సి.ఆర్ గారిదేనని అన్నారు. ఈ సుపరిపాలనను కొనసాగించాలంటే, బి.ఆర్.ఎస్. బలపర్చిన స్వాతిని గెలిపించాల్సిన అవసరముందని పిలుపు చేశారు.అభ్యర్థి స్వాతి హరి కుమార్ గెలిస్తే, వనపర్తి మరియు పెద్దమందడి నుండి మహబూబ్‌నగర్ వరకు వైద్య సేవల కోసం 5 అంబులెన్స్ సొంత వ్యయంతో అందిస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రైతుబంధు మాజీ అధ్యక్షులు జగదీశ్వర్ రెడ్డి, గ్రామ టిఆర్ఎస్ అధ్యక్షులు సేనపతి, గ్రామ సర్పంచ్ అభ్యర్థులు, సీనియర్ టిఆర్ఎస్ నాయకులు పురుషోత్తం రెడ్డి, సింగిరెడ్డి కురుమూర్తి, స్టార్ శ్రీనివాసులు, విష్ణు, శివకుమార్ మరియు మహిళా నాయకులు పాల్గొన్నారు.IMG-20251205-WA0206

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .