జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు గద్ధల సిరి ఎంపిక 

జాతీయస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు గద్ధల సిరి ఎంపిక 

అభినందించిన కోచ్ ఓలేటి సాంబమూర్తి, సాహితీ కళాశాల యాజమాన్యం
◆ ఈనెల 25 నుండి చెన్నైలో జరగే జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ లో సిరి తన ప్రతిభను చాటనుంది

ఖమ్మం బ్యూరో, డిసెంబర్ 5 , తెలంగాణ ముచ్చట్లు;

 తెలంగాణ రాష్ట్రం తరుపున జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ టేబుల్ టెన్నిస్ పోటీలకు ఖమ్మం సాహితీ జూనియర్ కళాశాలకు చెందిన విద్యార్థిని గద్దల సిరి అత్యంత ప్రతిభను కనబరిచి శుక్రవారం జాతీయస్థాయి పోటీలకు ఎంపికైంది. ఈనెల 25వ తేదీ నుండి చెన్నై (తమిళనాడు) వేదికగా జరగనున్న ప్రతిష్టాత్మకమైన జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ లో సిరి తన ప్రతిభను చాటనుంది. జాతీయస్థాయి పోటీలకు ఎంపికైన క్రీడాకారిని గద్దల సిరి ఖమ్మం సర్దార్ పటేల్ స్టేడియంలో నిత్యం సాధనలో తన ఆటతీరుతో జాతీయస్థాయి జట్టులో చోటు దక్కించుకోవడం ఖమ్మం జిల్లాకే గర్వకారణమని కోచ్ ఓలేటి సాంబమూర్తి అన్నారు. జాతీయస్థాయి పోటీలకు క్రీడాకారిని సిరి ఎంపిక కావడం పట్ల జిల్లా క్రీడా, యువజన అధికారి సునీల్ కుమార్ రెడ్డి, జిల్లా టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ అధ్యక్షులు బాలసాని విజయకుమార్, జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ కార్యదర్శి యాస రామారావు, స్కూల్ గేమ్స్ అడ్వైజర్ సైదులు సిరిని అభినందించారు. టేబుల్ టెన్నిస్ క్రీడలో సిరిని అత్యుత్తమంగా తీర్చిదిద్దటంలో ఖమ్మం పటేల్ స్టేడియం టేబుల్ టెన్నిస్ కోచ్ సాంబమూర్తి చేసిన కృషి, టేబుల్ టెన్నిస్ క్రీడ పట్ల ఆయనకున్న అంకితభావాన్ని సిరి తల్లిదండ్రులు ప్రత్యేకంగా కొనియాడారు. ఆయన శిక్షణలోనే తమ కూతురు సిరి ఈ స్థాయికి చేరుకున్నదని కోచ్ కు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

క్రీడాకారిణి గద్దల సిరి మాట్లాడుతూ...

జాతీయస్థాయిలో స్థానం సంపాదించడం నా కల అని, ఆడే అవకాశం రానే వచ్చిందన్నారు. ఇది ఒక గొప్ప గౌరవంగా భావిస్తానని, అందుకు మా కోచ్ సాంబమూర్తికి నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. దీనికి కృషి, పట్టుదల, సరైన మార్గనిర్దేశం ఎంతో అవసరమన్నారు. ఖమ్మం జిల్లా కేంద్రంలో చక్కని ఇండోర్ స్టేడియం, క్రీడాకారుల పట్ల ఆశక్తి కలిగిన ప్రభుత్వ  అధికారులు సునీల్ కుమార్ రెడ్డి, క్రీడాకారులకు తోడ్పాటును అందించే టేబుల్ టెన్నిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు బాలసాని విజయ్ కుమార్, టేబుల్ టెన్నిస్ జిల్లా కార్యదర్శి ఓలేటి సాంబమూర్తి కోచ్ లు మాకు దొరకటం మా అదృష్టంగా భావిస్తున్నామని వారికి క్రీడాకారుల తరుపున కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం కూరగాయల సాగులో మెళకువలపై మూడు రోజుల శిక్షణ కార్యక్రమం
మేడ్చల్–మల్కాజిగిరి, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు): మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా వాతావరణానికి అనువైన వంగడాల పెంపకం, కూరగాయల నిల్వ కాలాన్ని పెంచే విధానాలు, పంట అనంతరం తీసుకోవాల్సిన యాజమాన్య...
పిసిపిఎన్‌డిటి నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలి
కలెక్టర్ కార్యాలయంలో  ప్రజావాణికి 107 ఫిర్యాదులు
సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
కాప్రా మున్సిపల్ డీసీ జగన్‌పై సర్వత్రా నిరసనలు
సైబర్ మోసాల పట్ల అప్రమత్తం
క్రిటికల్ పోలింగ్ స్టేషన్ సందర్శించిన కల్లూరు ఏసిపి