సర్పంచ్‌గా మమతకు మద్దతుగా ఇంటింటా ప్రచారం చేసిన ఎర్రబెల్లి బండారి లక్ష్మారెడ్డి
ఉప్పల్, డిసెంబర్ 15 (తెలంగాణ ముచ్చట్లు):
పాలకుర్తి మండల పరిధిలోని తిరుమలగిరి గ్రామ సర్పంచ్‌గా చేరుపల్లి మమతను భారీ మెజారిటీతో గెలిపించాలని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు, ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పిలుపునిచ్చారు.సోమవారం సర్పంచ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా వారు గ్రామంలో ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామస్తులను కలిసి మమతకు మద్దతు తెలపాలని కోరారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి మాట్లాడుతూ, స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ పార్టీ బలపరిచిన అభ్యర్థుల గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమన్వయంతో కలిసి పనిచేయాలని కోరారు.కేసీఆర్ నాయకత్వంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు, గ్రామాభివృద్ధి కార్యక్రమాలను ప్రజలకు వివరించి చైతన్యపరచాలని సూచించారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయకేతనం బీఆర్ఎస్‌దేనని స్పష్టం చేశారు.ఈ కార్యక్రమంలో ఉప్పల్ నియోజకవర్గ కార్పొరేటర్లు, బీఆర్ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.


Comments