ఘనంగా 201వ జ్ఞానమాల కార్యక్రమం
ముఖ్య అతిథి సానాల సదాశివ చారి
కీసర, డిసెంబర్ 14 (తెలంగాణ ముచ్చట్లు)
మేడ్చల్ జిల్లా, కీసర మండల కేంద్రంలో కీసర మండలం అంబేద్కర్ సంఘం ఆధ్వర్యంలో వారం వారం నిర్వహిస్తున్న జ్ఞానమాల కార్యక్రమం 201వ వారానికి చేరుకుంది. ఆదివారం ఉదయం 9 గంటలకు నిర్వహించిన ఈ కార్యక్రమం ఘనంగా సాగింది.ఈ కార్యక్రమానికి అధ్యక్షుడిగా కొమ్ము సుదర్శన్, ప్రధాన కార్యదర్శిగా తుడుం శ్రీనివాస్ వ్యవహరించారు. 201వ జ్ఞానమాల కార్యక్రమానికి కీసర డివిజన్–1కు చెందిన కాంగ్రెస్ పార్టీ యువ నాయకులు సానాల సదాశివ చారి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా సానాల సదాశివ చారి మాట్లాడుతూ డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతికి ప్రత్యేక చట్టాలను రూపొందించారని పేర్కొన్నారు. ప్రపంచంలోనే భారత రాజ్యాంగం గొప్ప శక్తిగా నిలిచిందని తెలిపారు. 201వ జ్ఞానమాల కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడంపై సంతోషం వ్యక్తం చేశారు.ఈ కార్యక్రమంలో కీసర మండల కాంగ్రెస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ రామిడి విజయ్ రెడ్డి, గోధుమకుంట గ్రామ పంచాయతీ మాజీ ఎంపీటీసీ మంచాల పెంటయ్య, మాజీ ఉప సర్పంచ్ మంచాల రాజలింగం, కీసర మండల అంబేద్కర్ సంఘం ఉపాధ్యక్షులు బక్కని కుమార్, సంయుక్త కార్యదర్శి గంగి సుధాకర్, కట్ట శంకరయ్య, కోశాధికారి కానుకుంట శ్యామ్ కుమార్, సీనియర్ నాయకులు చినింగని ఆనంద్ రావు, చినింగని మల్లేష్ పాల్గొన్నారు.
అలాగే కీసర గ్రామ పంచాయతీ మాజీ వార్డ్ సభ్యులు శీలం మల్లేష్, గ్రామ టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు చినింగని బాలరాజ్, మేడ్చల్ నియోజకవర్గ జర్నలిస్ట్ యూనియన్ ప్రధాన కార్యదర్శి కర్రె గణేష్, రిపోర్టర్ తుడుం బాలకృష్ణ, కీసరగుట్ట మాజీ ట్రస్ట్ బోర్డు మెంబర్ రాగుల రమేష్ ముదిరాజ్, కీసర మండల అంబేద్కర్ సంఘం మాజీ ఉపాధ్యక్షులు బంటు శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు.నర్సంపల్లి గ్రామానికి చెందిన బండారి ఆయిలేష్, తోకటి కుమార్, ఆంజనేయులు గౌడ్, వీర్యాల గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు బోడ నర్సింగ్ రావు, తిమ్మయిపల్లి గ్రామ అంబేద్కర్ సంఘం మాజీ అధ్యక్షులు తాళ్ల కిరణ్, కీసర గ్రామ అంబేద్కర్ సంఘం అధ్యక్షులు ఎర్ర సాయిలు, పండుగ రాజలింగంముదిరాజ్, సుమన్ బన్నీ, పట్టా మహేందర్, దానోళ్ళ అభి తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.


Comments