మద్దిగట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దుతా
మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు
పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):
పెద్దమందడి మండలం మద్దిగట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దేందుకు నిరంతరం కృషి చేస్తానని మద్దిగట్ల గ్రామ సర్పంచ్ మేకల రాములు అన్నారు. గ్రామ ప్రజలు తనపై ఉంచిన నమ్మకానికి తగ్గట్టుగా పనిచేస్తూ, గ్రామాభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతానని స్పష్టం చేశారు.సోమవారం ఒక ప్రకటనలో సర్పంచ్ మేకల రాములు మాట్లాడుతూ.. గ్రామంలో తాగునీరు, పారిశుద్ధ్యం, విద్య, వైద్యం, రహదారులు, వీధిదీపాలు, డ్రైనేజీ, పచ్చదనం వంటి మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యత ఇస్తానని తెలిపారు. గ్రామంలో ఉన్న సమస్యలను దశలవారీగా పరిష్కరించి ప్రజలకు మెరుగైన సౌకర్యాలు అందిస్తామని పేర్కొన్నారు.గ్రామంలో పేదలు, నిరుపేదలు, రైతులు, మహిళలు, యువతకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో అందేలా చర్యలు తీసుకుంటామని అన్నారు. ప్రతి ఇంటికీ ప్రభుత్వ పథకాల లబ్ధి చేరేలా కృషి చేస్తామని తెలిపారు.ఈ సందర్భంగా సర్పంచ్ మేకల రాములు మాట్లాడుతూ, స్థానిక ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధికి అవసరమైన నిధులు, మౌలిక సదుపాయాలు సమకూర్చి మద్దిగట్ల గ్రామాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేస్తానని స్పష్టంగా తెలిపారు. ఎమ్మెల్యే మేఘా రెడ్డి సహకారంతో గ్రామాభివృద్ధి పనులు మరింత వేగవంతం చేస్తామని అన్నారు.ప్రజాప్రతినిధిగా ఎల్లప్పుడూ గ్రామ ప్రజలకు అందుబాటులో ఉంటానని, గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి సహకారం అవసరమని కోరారు. గ్రామ ప్రజల ఐక్యతతోనే మద్దిగట్లను అన్ని రంగాల్లో అభివృద్ధి చేసి ఆదర్శ గ్రామంగా నిలబెడతామని సర్పంచ్ మేకల రాములు ధీమా వ్యక్తం చేశారు.


Comments