ఏ ఎస్ రావు నగర్ లో జోయాలుక్కాస్ ‘బ్రిల్లియన్స్’ డైమండ్ ప్రదర్శన ప్రారంభం
ఏ ఎన్ రావు నగర్, డిసెంబర్ 05 (తెలంగాణ ముచ్చట్లు):
ఉప్పల్ నియోజకవర్గం కాప్రా మున్సిపల్ పరిధిలోని డా. ఎ.ఎస్. రావు నగర్‌లో జోయాలుక్కాస్ షోరూమ్‌లో ‘బ్రిల్లియన్స్’ డైమండ్ జ్యువెలరీ షో డిసెంబర్ 5 నుంచి 21 వరకు అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. విలాసవంతమైన వివాహ సెట్ల నుంచి స్టైలిష్ డైలీ వేర్ వరకు విభిన్నమైన వజ్రాభరణాలను ఈ ప్రత్యేక ప్రదర్శనలో అందుబాటులో ఉంచారు. ప్రతి డిజైన్ ప్రత్యేకమైనదిగా ఉండి, ప్రదర్శన కాలంలో మాత్రమే కస్టమర్లకు లభ్యమవుతుందని సంస్థ వెల్లడించింది.జోయాలుక్కాస్ గ్రూప్ చైర్మన్ డాక్టర్ జోయాలుక్కాస్ మాట్లాడుతూ…“వజ్రాల శాశ్వత అందాన్ని, డిజైన్ కళలోని నైపుణ్యాన్ని జరుపుకునే వేడుక ఇది. ఎ.ఎస్.రావు నగర్ మా ప్రయాణంలో ఎంతో ప్రత్యేకమైన ప్రాంతం” అని తెలిపారు.ప్రదర్శన సందర్భంగా రూ.1 లక్షకు పైగా వజ్రాభరణాలు కొనుగోలు చేసే కస్టమర్లందరికీ ఉచిత బంగారు నాణెం అందజేస్తామని సంస్థ ప్రకటించింది.ఈ ప్రత్యేక డైమండ్ షో డిసెంబర్ 21 వరకు ఎ.ఎస్.రావు నగర్ జోయాలుక్కాస్ షోరూమ్‌లో కొనసాగుతుంది. వజ్రాల కళ, అందం, నైపుణ్యం— అనుభవించేందుకు ఇది అరుదైన అవకాశమని నిర్వాహకులు తెలిపారు.ఈకార్యక్రమంలో రీజనల్ మేనేజర్ సునీల్ పీఎస్, రీజనల్ మార్కెటింగ్ మేనేజర్ కె. శ్రీనివాస్, జోయాలుక్కాస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.


Comments