పారిశుద్ధ్య కార్మికురాలి భర్త మృతి

మృతుని కుటుంబానికి ముదిరాజ్ యువత ఆర్థిక అండ

పారిశుద్ధ్య కార్మికురాలి భర్త మృతి

పెద్దమందడి,డిసెంబర్15(తెలంగాణ ముచ్చట్లు):

మదిగట్ల గ్రామానికి చెందిన పారిశుద్ధ్య కార్మికురాలు గొల్ల లక్ష్మమ్మ భర్త గొల్ల లక్ష్మయ్య శనివారం సాయంత్రం హఠాత్తుగా గుండెపోటుతో మృతి చెందారు. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు తీవ్ర విషాదంలో మునిగిపోయారు.ఈ విషయం తెలుసుకున్న ముదిరాజ్ సంగం యువకులు మానవతా దృక్పథంతో స్పందించి, తమ వంతు సహాయంగా అందరూ కలిసి రూ.20,500 నగదును సేకరించారు. సేకరించిన ఆర్థిక సహాయాన్ని  గొల్ల లక్ష్మమ్మ కి అందజేశారు.ఈ సందర్భంగా ముదిరాజ్ యువత మాట్లాడుతూ.. మృతుని కుటుంబానికి ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. అలాగే దేవుడు కుటుంబానికి మనోధైర్యం ప్రసాదించాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో ముదిరాజ్ యువత సభ్యులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .