హెచ్ఎంటి నగర్ లో కూలిపోయిన మ్యాన్‌హోల్ రిపేర్ పనులు ప్రారంభం
నాచారం, డిసెంబర్ 09 (తెలంగాణ ముచ్చట్లు)
ఉప్పల్ నియోజకవర్గం నాచారం డివిజన్ లోహెచ్ఎంటి నగర్ కాలనీకి జలమండలి వారు భారీగా మంచినీరు బల్క్ సప్లై అందించడంతో కాలనీలోని అనేక ప్రాంతాల్లో మురుగునీటి మ్యాన్ హోల్‌లు కూలిపోయినప్పటికీ వాటి మరమ్మతులపై జలమండలి నిర్లక్ష్యం చూపుతున్నారని స్థానికులు ఆరోపించారు.
ఉప్పల్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి,నాచారం కార్పొరేటర్ శాంతి సాయిజెన్ శేఖర్, ప్రత్యేక చొరవతో ప్రస్తుతం మురుగునీటి పైప్‌లైన్ల శుభ్రపరిచే పనులు జరుగుతున్నాయి.హెచ్ఎంటి నగర్ వీధి నెంబర్ 7లో దీర్ఘకాలంగా కూలిపోయిన మ్యాన్ హోల్ కారణంగా వాహనాలు ప్రమాదానికి గురవుతున్నాయని స్థానికులు ఫిర్యాదు చేయడంతో, కార్పొరేటర్ జలమండలి అధికారులతో మాట్లాడి కొత్త మ్యాన్ హోల్ నిర్మాణ పనులు చేపట్టడం జరిగింది.ఈ కార్యక్రమంలో హెచ్ఎంటి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షులు సుభాస్కర్, ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు, జాయింట్ సెక్రటరీ కిరణ్, బారాస నాయకులు సాయి జెన్ శేఖర్ తదితరులు పాల్గొన్నారు.


Comments