మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు

15 రోజుల్లో 110 మంది ఈవ్ టీజర్లు అదుపులో

మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి రాచకొండ సీపీ జి. సుధీర్ బాబు

రాచకొండ, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):

మహిళల భద్రతపై ఎలాంటి రాజీ ఉండదని, మహిళలను వేధించే వారిని వదిలిపెట్టే ప్రశ్నే లేదని రాచకొండ కమిషనర్ ఆఫ్ పోలీస్ జి. సుధీర్ బాబు, ఐపీఎస్ హెచ్చరించారు. బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు, మెట్రో స్టేషన్లు, స్కూళ్లు, కాలేజీలు, మార్కెట్లలో షీ టీమ్స్ మఫ్టీలో డెకాయ్ ఆపరేషన్లు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు.ఈ నెల 1 నుండి 15వ తేదీ వరకు రాచకొండ కమిషనరేట్ పరిధిలో 110 మంది (మేజర్స్–74, మైనర్స్–36) ఈవ్ టీజర్లను అదుపులోకి తీసుకొని, ఎల్‌బీ నగర్ ఉమెన్ సేఫ్టీ ఆఫీసులో కౌన్సిలర్లతో కౌన్సిలింగ్ నిర్వహించినట్లు విమెన్ సేఫ్టీ వింగ్ డీసీపీ టి. ఉషారాణి తెలిపారు.ఈ వ్యవధిలో మొత్తం 135 ఫిర్యాదులు అందగా, అందులో ఫోన్ ద్వారా 34, సోషల్ మీడియా ద్వారా 48, ప్రత్యక్ష వేధింపులపై 53 ఫిర్యాదులు నమోదయ్యాయి.డీసీపీ వివరించిన ముఖ్య కేసుల్లో—ప్రయాణికులపై దాడి చేసిన ఉబర్ ఆటో డ్రైవర్‌పై క్రిమినల్ కేసు నమోదు, సోషల్ మీడియాలో వేధింపులకు పాల్పడిన వ్యక్తి అరెస్ట్, వేరే నంబర్లతో కాల్స్ చేసి వేధించిన వ్యక్తి అరెస్టు, తుక్కుగూడ పార్క్‌లో అల్లరి చేసిన యువకుడిపై కేసు నమోదు వంటి ఘటనలు ఉన్నాయి.మహిళల భద్రతపై అవగాహన కల్పించేందుకు షీ టీమ్స్ ఈ నెలలో 49 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి 7,481 మందికి చట్టాలు, హక్కులు, జాగ్రత్తలు వివరించినట్లు అధికారులు తెలిపారు.మెట్రో రైళ్లలో కూడా డెకాయ్ ఆపరేషన్లు నిర్వహించి, మహిళా కంపార్ట్‌మెంట్‌లో ప్రయాణిస్తున్న 8 మంది పురుషులను బయటికి పంపించి, మెట్రో అధికారుల ద్వారా ఫైన్ విధింపజేశారు.వేదింపులకు గురైన మహిళలు భయపడకుండా షీ టీమ్స్‌కు ఫిర్యాదు చేయాలని డీసీపీ ఉషారాణి కోరారు.
*రాచకొండ వాట్సాప్ నంబర్*: 8712662111, అలాగే *బోనగిరి* 8712662598, *చౌటుప్పల్* 8712662599, *ఇబ్రహీంపట్నం* 8712662600, *కుషాయిగూడ* 8712662601, *ఎల్బీనగర్* 8712662602, *మహేశ్వరం* 8712665299,*మల్కాజ్గిరి* 8712662603, *వనస్థలిపురం* 8712662604, *యాదాద్రి* 8712665300, ఏరియా టీమ్స్ నంబర్లు అందుబాటు లో ఉన్నాయని తెలిపారు.కౌన్సిలింగ్ కార్యక్రమంలో డీసీపీ టి. ఉషారాణి, ఏసీపీ పల్లె వెంకటేశ్వర్లు, ఇన్స్పెక్టర్లు ఎం. ముని, జి. అంజయ్య, అడ్మిన్ ఎస్‌ఐ రాజు, షీ టీమ్స్ సిబ్బంది, కౌన్సిలర్లు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం అమ్మపల్లి సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డికి ఎమ్మెల్యే ఘన సన్మానం
పెద్దమందడి,డిసెంబర్‌13(తెలంగాణ ముచ్చట్లు): వనపర్తి జిల్లా పెద్దమందడి మండలం అమ్మపల్లి గ్రామంలో ఇటీవల జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపొందిన సర్పంచ్ గౌని మాధవి వెంకటేశ్వర రెడ్డిని వనపర్తి...
మణిగిల్ల సర్పంచ్ శ్రీనివాస్ గౌడ్‌ను సన్మానించిన మాజీ మంత్రి
వీరాయిపల్లి సర్పంచ్ చిట్యాల వెంకటేష్‌కు ఎమ్మెల్యే ఘన సన్మానం
మణిగిల్ల సర్పంచ్ పీఠం బీఆర్ఎస్ కైవసం
నాచారం ఎరుకల బస్తీలో రోడ్డు సమస్యపై  కార్పొరేటర్ కు వినతి పత్రం 
డ్రోన్ ద్వారా బందోబస్త్ పర్యవేక్షణ
ఘనంగా తేజ ఒకేషనల్ & పారామెడికల్ కళాశాల వార్షికోత్సవం!