టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వేణు గౌడ్‌కు ఘన సన్మానం

కీసర మండలం రిపోర్టర్ తుడుం బాలకృష్ణ

టి డబ్ల్యూ జె ఎఫ్ జిల్లా అధ్యక్షుడు జి వేణు గౌడ్‌కు ఘన సన్మానం

ఘట్‌కేసర్, డిసెంబర్ 10 (తెలంగాణ ముచ్చట్లు): 

మేడ్చల్ జిల్లా ఘట్‌కేసర్ మండలాని కి చెందిన జి వేణు గౌడ్ ఇటీవల టీ డబ్ల్యూ జె ఎఫ్ మేడ్చల్ జిల్లా అధ్యక్షుడిగా నియమితులైన సందర్భంగా కీసర రిపోర్టర్ బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్ రజనీకాంత్ గౌడ్ ఘనంగా సన్మానించారు.అన్నోజిగూడలోని వేణు గౌడ్ నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో విలేకరుల సమక్షంలో ఆయనను సత్కరించారు.ఈ సందర్భంగా జి వేణు గౌడ్ మాట్లాడుతూ, ప్రజల సమస్యలను నిర్భయంగా వెలికి తీయడంలో జర్నలిస్టుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యల పరిష్కారం కోసం ఎల్లప్పుడూ కృషి చేస్తానని హామీ ఇచ్చారు.అంతేకాకుండా, విలేకరుల సమస్యల పరిష్కారానికి పోరాటం చేస్తూ, ఎన్నికల సమయంలో జర్నలిస్టులకు ఓటింగ్ హక్కు కల్పించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ కార్యక్రమంలో కీసర రిపోర్టర్ బాలకృష్ణ, సీనియర్ రిపోర్టర్ రజనీకాంత్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .