కొత్తగూడెం మెడికల్ కళాశాల సమస్యలపై తుమ్మలతో భేటీ.!
భవన నిర్మాణం ఆలస్యంతో విద్యార్థులకు ఇబ్బందులు.
దమ్మపేట, నవంబర్ 27 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట మండలం గండుగులపల్లి గ్రామంలో గురువారం ఉదయం కొత్తగూడెం మెడికల్ కళాశాల ప్రిన్సిపాల్ సమక్షంలో ప్రొఫెసర్లు, సిబ్బంది, విద్యార్థులు రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ను కలిశారు.
నాలుగు ఏళ్ల క్రితం మంజూరైన మెడికల్ కళాశాల భవనం ఇంకా పూర్తికాకపోవడంతో విద్యార్థులు తీవ్రమైన ఇబ్బందులు పడుతున్న విషయం ను ప్రిన్సిపాల్‌తో పాటు విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. అవసరమైన వసతులు, తరగతి గదులు, ల్యాబ్‌లు సరిగా లేక చదువులో సమస్యలు ఎదురవుతున్నాయని వివరించారు.
వారి వివరణ విన్న మంత్రి తుమ్మల నాగేశ్వరరావు మెడికల్ కళాశాల సమస్యను వెంటనే ముఖ్యమంత్రి మరియు ఆరోగ్యశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. త్వరలో జరిగే ముఖ్యమంత్రి కొత్తగూడెం పర్యటనలో ఈ అంశాన్ని ప్రత్యేకంగా చర్చించి పరిష్కారం దిశగా కృషి చేస్తానని తెలిపారు. విద్యార్థులు ఆందోళన చెందవలసిన అవసరం లేదని భరోసా ఇచ్చారు.


Comments