కేసీఆర్ దీక్ష దినోత్సవం… సత్తుపల్లిలో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు.

కేసీఆర్ దీక్ష దినోత్సవం… సత్తుపల్లిలో బిఆర్ఎస్ శ్రేణుల సంబరాలు.

- తెలంగాణ తల్లికి పాలాభిషేకం.
- అంబేద్కర్ విగ్రహానికి నివాళులు.

సత్తుపల్లి, డిసెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):

స్థానిక పట్టణంలో తెలంగాణ సాధనకు అంకితభావంతో పోరాడిన కేసీఆర్ చేపట్టిన చారిత్రాత్మక దీక్ష విజయాన్ని పురస్కరించుకుని బిఆర్ఎస్ శ్రేణులు విశేషంగా సంబరాలు జరిపారు. పట్టణంలోని తెలంగాణ తల్లి విగ్రహానికి ఘనంగా పాలాభిషేకం నిర్వహించారు. ఈ కార్యక్రమం మున్సిపల్ మాజీ చైర్మన్ మహేష్ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడుతూ, రాష్ట్ర సాధనలో కేసీఆర్ దీక్ష తెలంగాణ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచి ప్రేరణనిస్తూనే ఉంటుంది అని అన్నారు. తెలంగాణ తల్లి ఆశీస్సులతో రాష్ట్రం మరింత అభివృద్ధి దిశగా పయనించాలని ఆకాంక్షించారు. పాలాభిషేకం అనంతరం బిఆర్ఎస్ శ్రేణులు డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఏకతా, సంకల్పానికి ప్రతీకగా గులాబీ బెలూన్లను ఆకాశంలోకి వదిలారు.

కార్యక్రమంలో స్థానిక బిఆర్ఎస్ నాయకులు, టౌన్ అధ్యక్షులు, యువజన విభాగం ప్రతినిధులు, మహిళా నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్దఎత్తున చేరి ఉత్సాహభరిత వాతావరణాన్ని సృష్టించారు. పట్టణం మొత్తం పండుగ శోభను సంతరించుకుంది.IMG-20251209-WA0014

Tags:

Post Your Comments

Comments

Latest News

జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు. జిల్లా ఉత్తమ ఉద్యోగిగా ఏఓ కురుమయ్యకు అవార్డు.
వనపర్తి,ఆగస్టు15(తెలంగాణ ముచ్చట్లు): వ్యవసాయ శాఖలో ఉత్తమ సేవలు అందిస్తున్న వనపర్తి ఏఓ కురుమయ్యకు జిల్లా ఉత్తమ ఉద్యోగి అవార్డు లభించింది. స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకొని శనివారం వనపర్తి...
హనుమాన్ ఆలయానికి మహర్దశ.
దేశభక్తి స్ఫూర్తితో హుజురాబాద్‌లో స్వాతంత్ర్య వేడుకలు.
కాంగ్రెస్ పార్టీ కార్యదర్శిగా శాగంటి మణి.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌లో ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు.
ఉప్పల్ ప్రెస్ క్లబ్‌ కు టీవీ అందజేత.
దేశ అభివృద్ధిలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించాలి .