ఆలోచించి ఓటు వేసి పనిచేసే వారిని సర్పంచ్ గా ఎన్నుకోండి.
వర్ధన్నపేట ఎమ్మెల్యే కేఆర్ నాగరాజు.
హసన్ పర్తి,డిసెంబర్10( తెలంగాణ ముచ్చట్లు):
హనుమకొండ జిల్లా హసన్ పర్తి మండల పరిధిలోని మడిపల్లి,అనంతసాగర్,జయగిరి,సితంపేట,పెంబర్తి, నాగారం,సీతా నాగారం గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ బలపరిచిన సర్పంచ్ అభ్యర్థులను భారీ మెజార్టీతో గెలిపించాలని వర్ధన్నపేట ఎమ్మెల్యే కెఆర్.నాగరాజు, జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు,కూడా చైర్మన్ ఇనుగాల వెంకటరామిరెడ్డి ప్రచార కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ మండల పరిధిలోని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానని అన్నారు.అభివృద్ధి,సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని గ్రామ అభివృద్ధిని దృష్టిలో పెట్టుకొని ఓటు వేయాలని అన్నారు. ఆలోచించి ఓటు వేసి పనిచేసేవారిని సర్పంచ్ గా ఎన్నుకోవాలని సూచించారు. కాంగ్రెస్ పార్టీ బలపరిచిన వారికి ఓటు వేసి ఊరును బాగు చేసుకుంటారో వేరే వాళ్లకు ఓటు వేసి ఊరును ఆగం చేసుకుంటారో ప్రజలు ఆలోచించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ సెల్ అధ్యక్షుడు పింగిలి వెంకట్రాం నరసింహారెడ్డి,ఆత్మకూర్ ఏఎంసి వైస్ చైర్మన్ తంగెళ్లపల్లి తిరుపతి, మండల పార్టీ అధ్యక్షుడు పోరెడ్డి మహేందర్ రెడ్డి, ఆయా గ్రామాల సర్పంచ్ అభ్యర్థులు తదితరులు పాల్గొన్నారు.


Comments