దమ్మపేటలో దారా రోహిణి గెలుపునకు కదలిరండి.!
టీడీపీ–సీపీఐ(ఎం)–బీఆర్‌ఎస్ ఉమ్మడి అభ్యర్థికి సంపూర్ణ మద్దతు.
దమ్మపేట, డిసెంబర్ 9 (తెలంగాణ ముచ్చట్లు):
దమ్మపేట గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఉమ్మడిగా బలపరిచిన సర్పంచ్ అభ్యర్థి దారా రోహిణి విజయానికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ కట్రం స్వామి దొర పిలుపునిచ్చారు. సర్పంచ్‌తో పాటు 14 వార్డుల అభ్యర్థులను కూడా భారీ మెజారిటీతో గెలిపించాలని ఆయన కార్యకర్తలకు సూచించారు.
మంగళవారం దమ్మపేటలో దివంగత నాయకుడు నాయుడు చెన్నారావు నివాసంలో జరిగిన స్థానిక ఎన్నికల సన్నాహక సమావేశం ఉత్సాహంగా సాగింది. ఈ సందర్భంగా కట్రం స్వామి దొర మాట్లాడుతూ, టీడీపీ, సీపీఐ(ఎం), బీఆర్‌ఎస్ కలిసి బలపరిచిన మన అభ్యర్థి దారా రోహిణికి ఉంగరం గుర్తుపై ఓట్లు సమకూర్చాలి. అత్యధిక మెజారిటీతో గెలిపించడం మనందరి బాధ్యత. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి మద్దతు కూడగట్టాలి. సర్పంచ్ రోహిణి తో పాటు 14 వార్డుల అభ్యర్థులన్నీ గెలిపించి దమ్మపేటను ఆదర్శ గ్రామంగా నిలపాలి అని స్పష్టంచేశారు. సమావేశంలో టీడీపీ మండల అధ్యక్షుడు ఎండీ వలీపాషా, నాయకులు నాయుడు వీరస్వామి, నాయుడు బాబురావు, నార్లపాటి శ్రీను, పొదిలి కృష్ణ, డొక్కా ప్రకాశ్, వల్లూరి వెంకటేష్, ఉయ్యాల లక్ష్మీనారాయణ, సున్నం శ్రీను, భవాని కృష్ణ, రజినీ లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. ప్రతి ఓటరును వ్యక్తిగతంగా కలిసి ఉంగరం గుర్తుకు ఓటు వేయాలని నాయకులు కోరారు.


Comments